News March 16, 2025

ADB: ఉచిత డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

నిరుద్యోగ బీసీ యువత కోసం బీసీ సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్ ఆధ్వర్యంలో రోడ్డు రవాణా సంస్థ ద్వారా ఉచిత హెవీ మోటర్ డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు తెలిపారు. HYD హకీంపేట్‌లో శిక్షణ ఉంటుందని, కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 31లోపు అన్ని ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులను ఆదిలాబాద్‌లోని కార్యాలయంలో సమర్పించాలన్నారు.

Similar News

News February 17, 2026

రేపు సెలవు కానీ పరీక్షలు యథాతథం: ADB కలెక్టర్

image

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 18న జిల్లాలో స్థానిక సెలవు ప్రకటించబడినప్పటికీ, అదే రోజున నిర్వహించాల్సిన ఎస్సెస్సీ ప్రీ–ఫైనల్ పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు వాయిదా వేయబడవన్నారు. జిల్లాలోని MEOలు, HMలు, SOలు, TGMS ప్రిన్సిపల్స్ పరీక్షలు నిర్ణీత టైమ్‌టేబుల్ ప్రకారం నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News February 17, 2026

కాగజ్‌నగర్‌లో SP అఖిల్ తనిఖీలు

image

కాగజ్‌నగర్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ తనిఖీ చేసి బందోబస్తును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పట్టణంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కాగజ్‌నగర్ మున్సిపల్ కార్యాలయం, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎస్పీ అఖిల్ తెలిపారు.

News February 16, 2026

BREAKING: కాంగ్రెస్‌లోకి ADB మున్సిపల్ ఛైర్‌పర్సన్

image

ప్రజాస్వామ్యంలో అభివృద్ధి కోసం కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం సరైన దేనని ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్ ఇన్‌ఛార్జ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన బండారి అనూష సోమవారం నిజామాబాద్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్‌లో చేరారు. వారిని అభినందించి శాలువాలతో సత్కరించారు. అనంతరం కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.