News April 21, 2024

ADB: ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు రద్దు

image

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 2023 జులై నెలలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ జిల్లా విద్యాధికారి ప్రణీత ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 23తో విద్యా సంవత్సరం ముగుస్తుండడంతో సర్దుబాటు చేసిన 121 మంది ఉపాధ్యాయుల డిప్యుటేషన్‌ను రద్దు చేస్తున్నట్లు శనివారం ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. వారందరూ ఏప్రిల్ 23న తమ పాఠశాలల్లో హాజరుకావాలని సూచించారు.

Similar News

News December 14, 2025

83.80 శాతం పోలింగ్ నమోదు

image

జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. 8 మండలాల్లో 139 పంచాయతీల్లో ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. పోలింగ్ సమయం ఒంటి గంట ముగిసే సరికి 83.80 శాతం పోలింగ్ నమోదు అయిందని అధికార వర్గాలు వెల్లడించారు. ఆయా మండలాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచారు.

News December 14, 2025

సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటో దిగిన ADB కలెక్టర్

image

జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేలా పలు మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మావల మోడల్ పోలింగ్ కేంద్రం వద్ద సెల్ఫీ పాయింట్లు అందంగా తయారు చేశారు. కేంద్రం పరిశీలనకు వచ్చిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఓటర్లతో కలిసి సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటోలు దిగారు.

News December 14, 2025

ఆదిలాబాద్ జిల్లాలో 58.17% పోలింగ్

image

ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 58. 17% ఓటింగ్ నమోదైంది. ఆదిలాబాద్(R)లో 58.00 శాతం, బేల 59.09, జైనథ్‌ 56.45, బోరజ్‌ 55.49, భీంపూర్‌ 59.99, సాత్నాల 63.46, తాంసి 57.30, మావలలో 53.06 ఓటింగ్ నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.
* జీపీ ఎలక్షన్ ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.