News May 13, 2024

ADB: ఓటేద్దాం.. ప్రశ్నిద్దాం..!

image

ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు లేదని నానుడి. మనల్ని పాలించే వారిని మనమే ఎన్నుకునేందుకు నేడు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ ఎంపీ స్థానంలో 2019లో 71.42 శాతం పోలింగ్ నమోదవగా పెద్దపల్లి ఎంపీ స్థానంలో 65.59 శాతం నమోదైంది. ఈసారి గతం కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని అధికారులు కోరారు.

Similar News

News December 14, 2025

ఆదిలాబాద్ జిల్లాలో 58.17% పోలింగ్

image

ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 58. 17% ఓటింగ్ నమోదైంది. ఆదిలాబాద్(R)లో 58.00 శాతం, బేల 59.09, జైనథ్‌ 56.45, బోరజ్‌ 55.49, భీంపూర్‌ 59.99, సాత్నాల 63.46, తాంసి 57.30, మావలలో 53.06 ఓటింగ్ నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.
* జీపీ ఎలక్షన్ ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.

News December 14, 2025

ఆదిలాబాద్ జిల్లాలో 21.80% పోలింగ్

image

ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 21.80% ఓటింగ్ నమోదైంది. ఆదిలాబాద్(R)లో 20.05 బేల 19.63, జైనథ్‌19.42, బోరజ్‌ 23.60, భీంపూర్‌ 24.93, సాత్నాల 28.00, తాంసి 24.26, మావలలో 16.40 ఓటింగ్ నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.
* జీపీ ఎలక్షన్ ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.

News December 14, 2025

ఆదిలాబాద్: నేడే పోలింగ్.. మీరు రెడీనా?

image

జిల్లాలో నేడు జరిగే 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే 17 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు ఏకగ్రీవం అయ్యారు. ఎన్నికలు జరిగే 8 మండలాల్లో ఆదిలాబాద్(R)లో 4, బేల 1, జైనథ్‌ 1, బోరజ్‌ 1, భీంపూర్‌ 5, సాత్నాల 2, తాంసిలో ముగ్గురు సర్పంచ్‌లు ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన పంచాయతీల్లో ఈరోజు పోలింగ్ జరగనుంది. ఉ.7గంటల నుంచి మ.1 వరకు పోలింగ్.. మధ్యాహ్నం ఫలితాలు ప్రకటిస్తారు. జీపీ ఎలక్షన్ ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.