News October 5, 2025
ADB: కాకా వెంకటస్వామి.. కార్మికులు మర్చిపోలేని పేరు

కాకా వెంకటస్వామి.. శ్రామిక వర్గం మరిచిపోలేని పేరు ఇది. భవన నిర్మాణ కూలీగా మొదలైన ఆయన ప్రస్థానం ఎంపీ, కేంద్రమంత్రి వరకు కొనసాగింది. పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచిన గడ్డం వెంకటస్వామి కార్మికుల కోసం చివరి శ్వాస వరకు పనిచేశారు. అంతేకాక స్వాతంత్ర్య ఉద్యమం, తెలంగాణ తొలి, మలిదశ పోరాటాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల బాట పట్టించారు.
#నేడు కాకా వెంకటస్వామి జయంతి
Similar News
News January 22, 2026
TU: మొదటి రోజు పరీక్షలకు 90 మంది విద్యార్థులు గైర్హాజరు

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో B.Ed, B.P.Ed,LLB,LLM 1,3 సెమిస్టర్ల, PG ఇంటిగ్రేటెడ్(APE/PCH), IMBA 3,5 రెగ్యులర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో జరిగిన B.Ed, B.P.Ed పరీక్షలకు 2,798 విద్యార్థులకు 2,721 మంది హాజరు కాగా, ఇంటిగ్రేటెడ్(APE/PCH),IMBA పరీక్షలకు 230 కి 217 మంది హాజరయ్యారన్నారు. 90 మంది గైర్హాజరయ్యారు.
News January 22, 2026
యాదాద్రి: ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగ వాణి రద్దు: కలెక్టర్

ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగ వాణి కార్యక్రమాన్ని ఈనెల 22వ తేదీన రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ప్రజలు, ఉద్యోగులు తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించేందుకు కలెక్టర్ కార్యాలయానికి రావద్దని తెలిపారు. అనివార్య కారణాలవల్ల ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.
News January 22, 2026
ఖమ్మం: ఆ ఇంట్లో అల్లుడే దొంగ..!

అత్తవారి ఇల్లు అల్లుడికి అడ్డా అనుకున్నాడో ఏమో గానీ, ఏకంగా నగలే ఊడ్చేశాడు. కారేపల్లి మండలానికి చెందిన రాంబాబు మద్యానికి బానిసై, డబ్బుల కోసం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని తన అత్త కలమ్మ ఇంట్లోనే ఒకటిన్నర తులాల బంగారు నెక్లెస్ దొంగిలించాడు. దాన్ని అమ్మేందుకు వెళ్తుండగా KMM సత్యనారాయణపురం క్రాస్ రోడ్ వద్ద పోలీసుల తనిఖీల్లో చిక్కాడు. అల్లుడే దొంగ అని తేలడంతో బాధితురాలు విస్మయం వ్యక్తం చేసింది.


