News December 1, 2025

ADB: గొంతు ఎత్తాలి.. నిధులు తేవాలి

image

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి ఎంపీలైనా గోడం నగేశ్ గడ్డం వంశీకృష్ణ పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడి నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. బాసర ఆలయ అభివృద్ధి, ఆదిలాబాద్- ఆర్మూర్ రైల్వే లైన్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్, సిర్పూర్, మంచిర్యాల రైల్వే లైన్‌లో కొత్త రైళ్ల రాకపోకలు, రైల్వే స్టేషన్లో అభివృద్ధిపై చర్చించాలి. పర్యాటక ప్రాంతాలకు నిధులు కేటాయించాలని కోరాలి.

Similar News

News February 19, 2026

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* పెనమలూరులో ఈనెల 21న జాబ్ మేళా
* మచిలీపట్నంలో రైల్వే జాబ్ స్కామ్
* కృష్ణా: పదో తరగతి పరీక్షలపై కలెక్టర్ సమీక్ష
* విజయవాడలో డివైడర్‌ను ఢీకొట్టిన ట్రావెల్ బస్సు
* బందర్‌లో బెల్ట్ దందా
* గుడివాడ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో అగ్ని ప్రమాదం
* గూడూరులో కొడుకు పై పేకాట కేసు.. తండ్రి ఆత్మహత్యాయత్నం

News February 19, 2026

కీసరగుట్ట బోర్డు పదవీకాలం ఏడాదే: హైకోర్టు

image

కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు గడువు పొడిగింపుపై TG హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ట్రస్టు బోర్డు పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన GO సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. TG చారిటబుల్ & హిందూ రిలీజియస్ ఇనిస్టిట్యూషన్స్& ఎండోమెంట్స్ చట్టం 1987లోని సెక్షన్ 17(2) ప్రకారం.. ట్రస్ట్ బోర్డు పదవీకాలం ఏడాది మాత్రమేనని స్పష్టం చేశారు.

News February 18, 2026

సంగారెడ్డి: ‘శివాజీ జయంతి శాంతియుతంగా నిర్వహించాలి’

image

ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి వేడుకలను శాంతియుతంగా నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ర్యాలీలు నిర్వహించేందుకు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. సూచించిన మార్గాల్లోనే ర్యాలీ నిర్వహించాలని, రహదారులు దిగ్బంధం చేయకుండా, ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా సమయపాలన పాటిస్తూ జాగ్రతలు తీసుకోవాలని సూచించారు.