News December 2, 2025
ADB: ‘చేతులు’ కలిశాయ్.. నేతలు ఒకటైనట్టేనా..?

జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలకు చెక్ పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. DCCఅధ్యక్షుడిగా నరేష్ జాదవ్ నియామకం, ఈనెల 4న CM రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నేతలంతా ఏకతాటిపైకి వచ్చారు. కొంతకాలంగా మాజీ మంత్రి స్వర్గీయ సిఆర్ఆర్, కంది శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి కంది శ్రీనివాస్ రెడ్డి ఆఫీసులో సోమవారం కలిశారు.
Similar News
News February 17, 2026
‘ఫర్టిగేషన్’లో ఎలాంటి ఎరువులను అందించే అవకాశం ఉంటుంది?

ఈ మధ్యకాలంలో రైతులు సేంద్రియ వ్యవసాయ పంటలకు జీవామృతం, వేస్ట్ డీకంపోజర్, వర్మీవాష్, జీవన ఎరువులను డ్రిప్ ద్వారానే అందిస్తున్నారు. జీవామృతాన్ని మాత్రం వడకట్టిన తర్వాత డ్రిప్ ద్వారా మొక్కలకు అందించాలి. రసాయన ఎరువులను డ్రిప్ ద్వారా అందిస్తే అన్ని మొక్కలకు సరైన మోతాదులో అందుతుంది. దీంతో పంట ఏకరీతిగా ఉంటుంది. ద్రవ రూపంలో నత్రజని, భాస్వరం, పొటాషియం మాత్రమే కాకుండా సూక్ష్మపోషక పదార్థాలను అందించవచ్చు.
News February 17, 2026
418 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<
News February 17, 2026
అధిక మాసంలో శుభ కార్యాలు ఎందుకు నిషిద్ధం?

అధిక మాసంలో సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడు. అందుకే దీనిని ‘శూన్య మాసం’ అంటారు. ‘మైల మాసం’ అని కూడా పిలుస్తారు. శాస్త్రం ప్రకారం.. సూర్య గమనం లేని ఈ సమయంలో చైతన్యం తక్కువగా ఉంటుంది. ఫలితంగా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు చేస్తే విఘ్నాలు ఎదురవుతాయని నమ్ముతారు. ఆశించిన ఫలితాలు దక్కవని పండితుల అభిప్రాయం. అందుకే ఈ మాసంలో లౌకిక శుభకార్యాలు పక్కన పెట్టాలని సూచిస్తున్నారు.


