News April 15, 2025
ADB: జాగ్రత్త.. రెండ్రోజులు దంచికొట్టనున్న ఎండలు

రోజురోజుకీ మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వేసవికాలంలో ఉష్ణోగ్రతలు రోజుకి ఒకలా మారుతున్నాయి. నిర్మల్ జిల్లాలో సోమవారం 39.7గా ఉన్న ఉష్ణోగ్రత మంగళవారం 40.4గా బుధవారం ఏకంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు.
Similar News
News April 19, 2025
మట్టెవాడ: స్టెరాయిడ్ టాబ్లెట్లను విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

ఎలాంటి అనుమతులు లేకుండా నిషేధిత స్టెరాయిడ్ టాబ్లెట్లను విక్రయిస్తున్న యువకుడిని మట్టెవాడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి పోలీసులు వివిధ రకాలైన స్టెరాయిడ్ టాబ్లెట్లు, టానిక్లు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అనుమతులు లేకుండా జిమ్ సెంటర్లలో టాబ్లెట్లు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ హెచ్చరించారు.
News April 19, 2025
కామారెడ్డి: ఉరేసుకొని వ్యక్తి మృతి

కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామానికి చెందిన చిన్న గంగయ్య(40) ఇంట్లో దులానికి ఉరేసుకొని చనిపోయాడు. పోలీసుల వివరాలు.. గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది మృతి చెందాడు. గురువారం రాత్రి బీరువా తాళాలు ఇవ్వాలని భార్యతో గొడవ పడ్డాడు. భార్య తాళాలు ఇవ్వకపోవడంతో మనస్థాపం చెంది ఉరేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని దేవునిపల్లి ఎస్ఐ రాజు తెలిపారు.
News April 19, 2025
చియా సీడ్స్‌తో గుండె ఆరోగ్యం పదిలం!

చియా సీడ్స్ వల్ల శరీరానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా అందుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి మెదడు, గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని తెలుపుతున్నారు. 100గ్రా. చేపల్లో 200-300 మి.గ్రాముల ఒమేగా ఫ్యాట్ ఉంటుందని, అదే 100గ్రా. చియా సీడ్స్ ద్వారా 18గ్రా. లభిస్తుందని వివరిస్తున్నారు. గుండె ఆరోగ్యం కోసం, రక్తంలో మంచి కొవ్వులు పెరగడానికి రోజూ 2స్పూన్లు నానబెట్టుకొని తీసుకోవాలని సూచిస్తున్నారు.