News December 1, 2025
ADB: ‘డబ్బు పంపండి.. లేదంటే న్యూడ్ ఫొటోలు పంపుతాం’

ఆదిలాబాద్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. బోథ్‌కు చెందిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడికి ఓ నంబర్ నుంచి కాల్ వచ్చింది. వెంటనే తన అకౌంట్‌కు డబ్బులు పంపాలని లేదంటే బాధితుడి న్యూడ్ ఫొటోలు ఫ్రెండ్స్‌కు, రిలేటివ్స్‌కు పంపుతాం అని హిందీలో బెదిరించారు. ఫోన్ నంబర్ పాకిస్థాన్‌కు చెందినదిగా గుర్తించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Similar News
News February 11, 2026
తిరుమల: లీవ్ పెట్టారా.. పెట్టించారా?

తిరుమల కల్తీ నెయ్యి కేసులో టీటీడీ ఎఫ్ఏ అండ్ సీఏవో ఓ.బాలాజీ ప్రమేయం ఉందని సిట్ తేల్చింది. చర్యలకు సిఫార్సు చేసింది. అయితే ఆయన సెలవుపై వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. గడిచిన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో సెలవు పెట్టారని కొందరి వాదన. చర్యలు తీసుకునే ముందు ఆయనను సెలవు పెట్టించారనే ప్రచారం సైతం జరుగుతోంది. మరి ఆయనపై ఎలాంటి చర్యలు ఉంటాయనేది చూడాలి మరి.
News February 11, 2026
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 110 పాయింట్లు కోల్పోయి 84,163 వద్ద.. నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 25,921 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో M&M, టైటాన్, మారుతీ, SBI షేర్లు లాభాల్లో.. HCL టెక్, ట్రెంట్, TCS, ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మూడు రోజుల వరుస లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు గరిష్ఠాల వద్ద అమ్మకాలకు దిగుతున్నారు.
News February 11, 2026
జగిత్యాల: ఐదు మున్సిపాలిటీల పోలింగ్‌పై కలెక్టర్ దృష్టి

జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్‌పెల్లి, రాయికల్ మున్సిపాలిటీలలో బుధవారం జరుగుతున్న రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వెబ్ క్యాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల లోపల ఓటింగ్ సరళి, బయట ఓటర్ల రద్దీని ఆయన గమనించారు.


