News August 20, 2025
ADB: నీట్ పీజీ ఫలితాల్లో సత్తా చాటిన యజ్ఞ

నీట్ పీజీ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా యువతి సత్తా చాటింది. తాంసి మండలం కప్పర్ల గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గండ్రత్ నారాయణ, సురేఖ దంపతుల కుమార్తె యజ్ఞ కాకతీయ యూనివర్సిటీలో పీజీ అభ్యసించింది. ఆల్ ఇండియా పీజీలో 7931 ర్యాంక్ సాంధించి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. దీనిపై కుటుంబీకులతో పాటు పలువురు యజ్ఞను అభినందించారు.
Similar News
News January 20, 2026
సిరిసిల్ల: ‘మున్సిపల్ ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలి’

పురపాలక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో అవసరమైన ఏర్పాట్లు చేసి సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల సన్నద్దతపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.
News January 20, 2026
వేములవాడ : ఎర్ర బ్యాడ్జీలతో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన

ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ వేములవాడ ఆర్టీసీ డిపో ఆవరణలో మంగళవారం తెల్లవారుజామున ఉద్యోగులు నిరసన తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని, టికెట్ తీసుకుని ప్రయాణిoచే భాద్యత ప్రయాణికులకే ఉండే విధంగా చూడాలని, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు అన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఎర్ర బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
News January 20, 2026
రోజూ 8 గ్లాసుల నీళ్లు తాగాలా?

ప్రతి ఒక్కరూ రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగాలనే నియమానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని డాక్టర్లు చెబుతున్నారు. నీటి అవసరం అనేది మనిషి బరువు, చేసే పని, ఉండే వాతావరణంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అందరికీ ఒకే లెక్క సరిపోదని, మన శరీరానికి నీరు కావాలనిపించినప్పుడు ‘దాహం’ రూపంలో సంకేతం ఇస్తుందని వివరించారు. అందువల్ల దాహం వేయకపోయినా బలవంతంగా నీళ్లు తాగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. SHARE IT


