News June 19, 2024
ADB: నేటి నుంచి 3వ విడత అడ్మిషన్లు షురూ

ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు మూడు విడతల్లో జరగనున్నాయి. మొదటి, రెండో విడతలు ముగియగా నేటి నుంచి మూడో విడత అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. జూన్ 19 నుంచి జులై 2 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే నేటి నుంచి జులై 3 వరకు 3వ దశ వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. జులై 6న మూడో దశ సీట్ల కేటాయింపు జరుగుతుంది. జులై 8 నుంచి డిగ్రీ కళాశాలల తరగతులు ప్రారంభం కానున్నాయి.
>SHARE IT
Similar News
News January 14, 2026
ADB: చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు

చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన ఆదిలాబాద్‌లోని నేషనల్ మార్ట్ సమీపంలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న సంతోష్ మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదం జరిగిందని కాలనీవాసులు తెలిపారు. ఈ మేరకు అతడిని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News January 13, 2026
ఆదిలాబాద్: రూ.90 పెరిగిన పత్తి ధర

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో మంగళవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,710గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ధర రూ.90 పెరిగినట్లు వెల్లడించారు.
News January 12, 2026
ADB: రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షురాలిగా జమునా నాయక్

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని దానోరా (బి) సర్పంచ్ జాదవ్ జమునా నాయక్ తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. సర్పంచుల సంఘం బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. క్రమశిక్షణతో పాటు రాష్ట్ర అభివృద్ధికై తోడ్పాటు చేస్తానని జమునా నాయక్ పేర్కొన్నారు.


