News August 11, 2025

ADB: నేడే LAST.. APPLY NOW

image

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లకు సోమవారం చివరి రోజు అని నిర్మల్ కాలేజ్ ప్రిన్సిపల్ రమేశ్ తెలిపారు. ఎలక్ట్రికల్, మెకానిక్ ఇంజినీరింగ్ కోర్సుల్లో సీట్లు ఖాళీ ఉన్నట్లు ఆయన తెలిపారు. పదో తరగతి పాసైన అభ్యర్థులు చేరేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9010222174, 9948156588, 9505510050 నంబర్లకు కాల్ చేయాలని ఆయన సూచించారు.

Similar News

News March 7, 2026

ఊర్కొండ: సర్పంచ్ భర్తపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు

image

ఊర్కొండ సర్పంచ్ భర్త మేకల శ్రీనివాసులు కాంగ్రెస్ నాయకులను, ఎస్సీ వర్గానికి చెందిన వారిని దుర్భాషలాడిన వ్యవహారం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, బాధితుల ఫిర్యాదు మేరకు శుక్రవారం ఆయనపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసుపై కల్వకుర్తి డీఎస్పీ దర్యాప్తు చేయనున్నారని ఎస్సై కృష్ణదేవ తెలిపారు.

News March 7, 2026

నేపాల్ రాజకీయాలను మలుపుతిప్పిన ‘స్టార్లు’

image

ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ జోరుతో నేపాల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దీని వెనుక ఇద్దరు ‘స్టార్లు’ ఉన్నారు. ఒకరు TV ప్రెజెంటర్, RSP ఫౌండర్ రబి లామిచానే కాగా మరొకరు ర్యాపర్ బాలెన్ షా. 2022లో RSP స్థాపించిన రబి, రాజకీయ చతురతతో తక్కువకాలంలో Dy.PM హోదాకు చేరారు. ఇక ర్యాపర్ బాలెన్ షా యువతలో ఆదరణ సంపాదించారు. 2025లో షా RSPలో చేరి రబితో చేతులు కలపడంతో అక్కడి పాలిటిక్స్‌ మలుపు తిరిగాయి.

News March 7, 2026

సిరిసిల్ల: ‘ప్రజా పాలన’తో గ్రామాల్లో మార్పు: కలెక్టర్

image

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించి సమూల మార్పు తీసుకువస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జిల్లాలో కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ, క్షేత్రస్థాయిలో ప్రజలకు మేలు జరిగేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతామని కలెక్టర్ స్పష్టం చేశారు.