News December 2, 2025
ADB: మరోసారి అవకాశం కల్పిస్తా ఈసారికి ఆగు..!

పంచాయతీ ఎన్నికల్లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే తొలి విడత నామినేషన్ల స్వీకరణ పూర్తి కాగా రెండో విడత కొనసాగుతోంది. ఈసారి తమకు అనుకూలంగా రిజర్వేషన్ రావడంతో ఒకే వర్గానికి చెందిన పలువురు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో ఒకరినొకరు బుజ్జగిస్తున్నారు. నామినేషన్లు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేస్తున్నారు. మరోసారి నీకు అవకాశం కల్పిస్తా ఈసారికి ఆగు అన్నట్లు మాట్లాడుతున్నారు.
Similar News
News February 7, 2026
MNCL: కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యే వరకు

కౌన్సిలర్‌గా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టి, 4 సార్లు అసెంబ్లీలో అడుగుపెట్టిన ఘనత నడిపల్లి దివాకర్ రావుది. 1981లో కౌన్సిలర్‌గా గెలిచిన ఆయన, ఆ తర్వాత 1999, 2004, 2014, 2018 ఎన్నికల్లో లక్షెట్టిపేట, MNCL నుంచి MLAగా విజయం సాధించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు, గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ సాకారం కావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తరఫున సేవలందించిన ఆయన రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేశారు.
News February 7, 2026
బంధం విఫలం అవ్వడం మీ తప్పు కాదు

ప్రేమలో విఫలం అయిన తర్వాత చాలామంది తమ తప్పుల వల్లే అలా అయిందని బాధపడుతుంటారు. ఇలాంటి ప్రతికూల ఆలోచనలు డిప్రెషన్‌కు కారణమవుతాయంటున్నారు నిపుణులు. వాళ్ల ఆలోచనలు, గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడం సరికాదు. సానుకూల దృక్పథం, స్వీయ ప్రేమను అలవర్చుకొని జీవితంలో ముందుకు సాగాలి. ఎంత ప్రయత్నించినా బాధ నుంచి బయటపడలేకపోతుంటే మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది.
News February 7, 2026
MHBD: నలుగురు అభ్యర్థుల ఇంటి పేరు ఒకటే!

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ 3వ వార్డులో ఎన్నికల పోరు విభిన్నంగా మారింది. ఎస్సీ రిజర్వుడ్ అయిన ఈ వార్డులో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతో పాటు జనసేన నుంచి బరిలో ఉన్న నలుగురు అభ్యర్థుల ఇంటి పేరు ‘తూర్పాటి’ కావడం విశేషం. ఒకే సామాజిక వర్గం, ఒకే ఇంటి పేరు గల అభ్యర్థులు తలపడుతుండటంతో ఓటర్లలో అయోమయం నెలకొంది. ఈ ‘తూర్పాటి’ల సమరంలో విజేత ఎవరోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.


