News November 30, 2025
ADB: యోగా ఫలితాలు ఎప్పుడు సారూ..!

KU అనుబంధం ఉన్న SDLCEలో పరీక్షలు పెట్టడం, ఫలితాలు మరిచిపోవడం ఈ మధ్య ఎక్కువైంది. గతేడాది తీసుకొచ్చిన కొత్త కోర్సు డిప్లొమా ఇన్ యోగా పరీక్షలను ఆగస్టు 12 నుంచి 18 వరకు నిర్వహించారు. పరీక్షలు జరిగి 4 నెలలవుతున్నా ఫలితాలు ప్రకటించకపోవడంతో, ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నామని అభ్యర్థులు వాపోతున్నారు. యోగా డిప్లొమా ఉంటే యోగా టీచర్ ఉద్యోగాలు వస్తాయని, ఈ ఫలితాలు ప్రకటించకపోవడం మూలంగా నష్టపోతున్నామంటున్నారు.
Similar News
News February 13, 2026
కామారెడ్డి: ప్రభావం చూపని తెలంగాణ రాజ్యాధికార పార్టీ

బీసీల కోసం ఆవిర్భవించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఆ పార్టీ అభ్యర్థులు పలు వార్డుల్లో పోటీ చేయగా వారి గెలుపు కోసం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేశారు. అయినా ఈ ఎన్నికల్లో నిరాశ తప్పలేదు.
News February 13, 2026
వేములవాడ: మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు పరిశీలించిన ఈవో

వేములవాడలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను రాజన్న ఆలయ ఈవో రమాదేవి పరిశీలించారు. 14వ తేదీ శనివారం నుండి మూడు రోజులపాటు భీమేశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం రూ.కోటి 96 లక్షలతో ఏర్పాట్లు చేపట్టారు. శుక్రవారం శివార్చన స్టేజి పనులు, లడ్డు ప్రసాదాల తయారీ, క్యూలైన్లు, బారికేడ్ల ఏర్పాటు తదితర పనులను ఆమె పరిశీలించారు.
News February 13, 2026
రేపు పాఠశాలలు యథావిధి.. సెలవు రద్దు!

రెండో శనివారం అనగా రేపు పాఠశాలలకు సెలవు ఉండదని విద్యాశాఖ స్పష్టం చేసింది. సాధారణంగా రెండో శనివారం సెలవు ఉంటుందని భావించి ఉపాధ్యాయులు ముందే సెలవు ప్రకటించగా, విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలతో జిల్లా అధికారులు ఆ నిర్ణయాన్ని మార్చారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు యథావిధిగా నడవాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు సమాచారం చేరవేస్తూ పాఠశాలకు రావాలని కోరుతున్నారు.


