News November 30, 2025
ADB: యోగా ఫలితాలు ఎప్పుడు సారూ..!

KU అనుబంధం ఉన్న SDLCEలో పరీక్షలు పెట్టడం, ఫలితాలు మరిచిపోవడం ఈ మధ్య ఎక్కువైంది. గతేడాది తీసుకొచ్చిన కొత్త కోర్సు డిప్లొమా ఇన్ యోగా పరీక్షలను ఆగస్టు 12 నుంచి 18 వరకు నిర్వహించారు. పరీక్షలు జరిగి 4 నెలలవుతున్నా ఫలితాలు ప్రకటించకపోవడంతో, ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నామని అభ్యర్థులు వాపోతున్నారు. యోగా డిప్లొమా ఉంటే యోగా టీచర్ ఉద్యోగాలు వస్తాయని, ఈ ఫలితాలు ప్రకటించకపోవడం మూలంగా నష్టపోతున్నామంటున్నారు.
Similar News
News February 7, 2026
ములుగు: ప్రియురాలి ఇంటి వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం

ప్రియురాలి ఇంటి ముందు ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన ములుగు జిల్లాలో కలకలం రేపింది. భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్‌కు చెందిన యువకుడు, కన్నాయిగూడెం మండలం రాజన్నపేటలోని తన ప్రియురాలి ఇంటి వద్దకు చేరుకుని పురుగుమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 7, 2026
MHBD: మున్సిపల్ ఎన్నికలు.. కో-ఆర్డినేటర్ల నియామకం

జిల్లాలోని మున్సిపాలిటీలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమన్వయకర్తలను నియమించారు. ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించేందుకు కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. మరిపెడకు ఎంపీ బలరాం నాయక్, డోర్నకల్‌కు గదార్ల అశోక్, మహబూబాబాద్‌కు వెంకటేష్, కేసముద్రానికి వెంకట్ రమణలను కేటాయించారు. తొర్రూర్ బాధ్యతలను కడియం కావ్య, హనుమంత్ రెడ్డిలకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News February 7, 2026
తిరుపతి: విద్యార్థులకు గమనిక.. రూ.15 వేల ప్రైజ్‌మనీ

5-10వ తరగతి విద్యార్థుల కోసం ప్రైమ్ మినిస్టర్ ఇన్నోవేటివ్ అవార్డ్‌కు దరఖాస్తులు కోరుతున్నట్లు సైన్స్ సెంటర్ కోఆర్డినేటర్ శ్రీనివాస నెహ్రూ తెలిపారు. విద్యార్థులు మార్చి 10లోపు జిల్లా విద్యాశాఖకు దరఖాస్తులు సమర్పించాలన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ మూడు ప్రాజెక్టులకు రూ.15వేల నగదు బహుమతి అందజేస్తారు. జాతీయ స్థాయి ఆన్‌లైన్ క్విజ్ ఫిబ్రవరి 12న నిర్వహించనున్నారు.


