News September 11, 2025

ADB: వాగు దాటి.. వైద్యం చేసి

image

బాధిత గ్రామాల ప్రజలకు సేవ చేయడానికి వైద్య సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారు. బజార్‌హత్నూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడానికి వైద్య సిబ్బంది పడ్డ కష్టాలు చూస్తే వారి అంకితభావం అర్థమవుతుంది. గ్రామానికి అడ్డుగా ప్రవహిస్తున్న వాగును తంటాలు పడుతూ దాటి, నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన మందులు పంపిణీ చేశారు.

Similar News

News December 9, 2025

గద్వాల్: మద్యం మత్తులో దాడులు.. ముగ్గురికి తీవ్రగాయాలు

image

గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ముగ్గురు యువకులు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గద్వాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాలి. రాత్రి మద్యం సేవించడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు అంటున్నారు.

News December 9, 2025

కామారెడ్డి: ‘అన్నా నమస్తే.. ఊరికొస్తున్నావా’

image

కామారెడ్డి జిల్లాలో తొలి విడతలో 167 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో ఎన్నికలకు మరో ఒక్క రోజే గడువు ఉండడంతో అందుబాటులో లేని స్థానిక ఓటర్లకు అభ్యర్థులు పదేపదే కాల్స్ చేస్తున్నారు. చాలా మంది రాజధాని పరిధిలోని HYD,రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు వివిధ పనుల నిమిత్తం వెళ్లారు. వారికి కాల్ చేసి ‘అన్నా నమస్తే.. ఊరికొస్తున్నావ్ కదా.. నాకే ఓటేయాలి’ అంటూ ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తున్నారని సమాచారం.

News December 9, 2025

NIT వరంగల్‌లో 45పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

<>NIT<<>> వరంగల్ 45 ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు గడవును పొడిగించింది. అప్లైకి DEC 12 ఆఖరు తేదీ కాగా.. DEC 31వరకు పొడిగించారు. పోస్టును బట్టి PhD, ME, ఎంటెక్, MSc, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.2000, SC, ST, PwDలకు రూ.1000. వెబ్‌సైట్: https://nitw.ac.in/faculty