News November 8, 2025

ADB: శిక్షణ సివిల్ సర్వీస్ అధికారుల బృందానికి వీడ్కోలు

image

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్‌కు చెందిన శిక్షణ అధికారులు (ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్, ఐఈఎస్, ఐఎస్ఎస్) బృందం జిల్లా పర్యటన ముగిసింది. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 23, 2026

ఉట్నూర్: పాలిటెక్నిక్ లేటరల్ ఎంట్రీకి దరఖాస్తు ఆహ్వానం

image

ఐటీఐ పూర్తి చేసి పాలిటెక్నిక్ కళాశాలలో లెటరల్ ఏంట్రీ ద్వారా నేరుగా ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించడానికి ప్రకటన విడుదలైనట్లు ఉట్నూర్ ప్రభుత్వ గిరిజన ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఐటీఐలో 60% మార్కులతో రెండేళ్ల కోర్సు తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలన్నారు. తమ సమీపంలోని ఐటీఐ కళాశాలలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అర్హులైన యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News January 23, 2026

ఆదిలాబాద్: ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల స్వీకరణ

image

మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, టైలరింగ్ కోర్స్‌లకు ఉచిత శిక్షణ కోసం మైనార్టీల నుంచి (ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైనులు, బౌద్ధులు, పార్శీ) దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ADB DMWO కలీం తెలిపారు. జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌కు ఇంటర్ , డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు, టైలరింగ్ కోసం పదో తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఈనెల 28లోపు దరఖాస్తులను ఇవ్వాలన్నారు.

News January 23, 2026

ఓటు రాజ్యాంగం కల్పించిన గొప్ప వరం: ఆదిలాబాద్ కలెక్టర్

image

ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, అది భారత రాజ్యాంగం మనకు కల్పించిన గొప్ప హక్కని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం వంటిదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావడంతోపాటు, ఎన్నికల సమయంలో తమ హక్కును వినియోగించుకోవాలని సూచించారు.