News August 13, 2025

ADB: హర్ ఘర్ తిరంగా ప్రచారం

image

మిషన్ శక్తి – DHEW బృందం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని పలు విద్యాసంస్థల్లో బుధవారం హర్ ఘర్ తిరంగా ప్రచారం కార్యక్రమంతో పాటు అవగాహన సదస్సు నిర్వహించారు. పౌరులు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రోత్సహించే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని చేపట్టినట్లు జిల్లా మిషన్ కోఆర్డినేటర్ యశోద తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా దేశభక్తి భావాన్ని పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

Similar News

News March 15, 2026

ADB: కుప్ప కూలిన టెంట్.. తప్పిన ప్రమాదం

image

జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన హీరా సుకా జయంతి వేడుకల సందర్భంగా భోజనం కోసం ఏర్పాటు చేసిన టెంటు గాలికి కుప్ప కూలింది. ఆ సమయంలో భోజనాలు ప్రారంభం కాకుండా ఆ టెంటు కింద కొంత మంది మాత్రమే ఉండడంతో ప్రమాదం తప్పింది. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే చిన్నపాటి గాలికి టెంటు కుప్ప కూలిందని ఆదివాసీ పర్ధాన్‌ వాపోయారు.

News March 14, 2026

పనులను వేగవంతం చేయాలి: ADB కలెక్టర్

image

జిల్లాలో ప్రతిపాదించిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్‌కు సంబంధించిన భూ సేకరణ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ నిర్మాణాల పురోగతి తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ఉందన్నారు.

News March 14, 2026

థర్డ్ పార్టీ అప్లికేషన్లపై అప్రమత్తంగా ఉండాలి: ADB SP

image

తెలియని థర్డ్ పార్టీ అప్లికేషన్లను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేయకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా SP అఖిల్ మహాజన్ సూచించారు. వీటి ద్వారా డాటా చోరీ, మొబైల్ హ్యాకింగ్, ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో ఈ వారం 14 సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయి. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.