News September 13, 2025

ADB: హ్యాట్సాప్.. ఆ నలుగురు టీమ్

image

జీవితంలో ఎవరికైనా సహాయం చేయాలంటే డబ్బు మాత్రమే కాదని మంచి మనసు కూడా కావాలని 10 మందితో కూడిన ‘ఆ నలుగురు’ టీమ్ నిరూపిస్తోంది. గుడిహత్నూర్ మండలం సీతాగొందిలో గత 5 సంవత్సరాలుగా గ్రామంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు అంత్యక్రియలకు 10 మంది కలిసి రూ.5,500 స్వతహాగా అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఆఖరి మజిలిలో అందరికీ అండగా నిలుస్తున్న వారి తీరుపై అంతటా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Similar News

News December 8, 2025

HYD: 2 రోజుల కోసం 2 నెలలుగా ప్రత్యేక దృష్టి

image

నేడు, రేపు ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి 2 నెలల ముందునుంచే అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. నిత్యం సమీక్షలు, ఏర్పాట్లు, అతిథులు, ఆహ్వానాలు.. ఇలా అన్నింటిని తానే నడిపించారు. ఎక్కడా.. పొరపాట్లు దొర్లకుండా అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీకి వెళ్లి ప్రధాని, రాహుల్ గాంధీని ఆహ్వానించారు. వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకురావాలనేది సీఎం ఆశయం.   

News December 8, 2025

ఖమ్మం: మద్యం దుకాణాలు బంద్

image

డిసెంబర్ 11,14,17 తేదీలలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని ఆయా మండలల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. డిసెంబర్ 11 న జరిగే ఎన్నికలకు డిసెంబర్ 9న సాయంత్రం 5:00 గంటల నుంచి డిసెంబర్ 11న ఎన్నికలు ముగిసి, ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించే వరకు ఆయా మండలల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలన్నారు.

News December 8, 2025

బాపట్ల: 108లో డ్రైవర్ల పోస్టుకు ఇంటర్వ్యూ

image

ప్రభుత్వ 108 వాహనంలో డ్రైవర్ల పోస్ట్‌కు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా మేనేజర్ బాలకృష్ణ సోమవారం తెలిపారు. ఈనెల 10, 11న గొల్లపూడిలోని విజయవాడ భవ్య హెల్త్ సర్వీసెస్ ఆఫీస్ వద్ద ఇంటర్వ్యూ నిర్వహిస్తారని తెలిపారు. అభ్యర్థులు 10th పాసై, హెవీ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. ఆసక్తి ఉన్న వారు పై తేదీలలో ఇంటర్వూకి హాజరుకావాలని సూచించారు.