News October 8, 2025
ADB: వాట్సాప్‌లో ‘చలాన్’ ఫైల్.. ఓపెన్ చేస్తే..?

RTO చలాన్ పేరుతో ఓ APK ఫైల్ సోషల్ మీడియా వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో పలువురికి గుర్తుతెలియని నంబర్ నుంచి ఈ మెసేజ్ వచ్చింది. చలాన్ పెండింగ్ ఉందని, కోర్టులో కట్టాలని FORM నింపాలంటూ డీటెయిల్స్‌తో కూడిన APK ఫైల్ వచ్చింది. ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగమని, ఎవరూ కూడా ఈ APKను ఓపెన్ చేయవద్దని పోలీసులు సూచించారు. ఆ మెసేజ్‌ను వెంటనే డిలీట్ చేయాలన్నారు.
Similar News
News March 12, 2026
కుప్పం: తేనెటీగల దాడిలో పలువురికి గాయాలు

కుప్పం పట్టణం గాండ్ల వీధిలో శుక్రవారం మధ్యాహ్నం తేనెటీగలు దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో జనం పరుగులు తీశారు. తేనెటీగల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి బిడ్డలు మంగమ్మ, ప్రవీణ్, ప్రశాంత్ గాయపడి కుప్పం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరితోపాటు మరి కొంతమందిపై తేనెటీగలు దాడి చేసినట్లు తెలిసింది.
News March 12, 2026
కడప: నేటి ఇంటర్ 1st ఇయర్ పరీక్షలకు 92% విద్యార్థులు హాజరు.!

కడప జిల్లాలో గురువారం 59 సెంటర్లలో ఇంటర్ 1st ఇయర్ కామర్స్ పేపర్-1 పరీక్షలు జరిగాయి. నేటి పరీక్షలకు 92% విద్యార్థులు హాజరయ్యారు. 3,226 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 2,956 మంది హాజరయ్యారు. 270 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదు. నేటి పరీక్షలకు ఒకేషనల్ విద్యార్థులు లేరు. నేటి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్ మీడియట్ అధికారులు తెలిపారు.
News March 12, 2026
సముద్ర గర్భంలో మృత్యుపాశాలు!

సముద్ర గర్భంలో దాగి ఉండే ‘నావికా దళ మైన్స్’ అత్యంత ప్రమాదకరమైనవి. తాజాగా హార్ముజ్ జలసంధిలో ఇరాన్ వీటిని మోహరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి నౌకలను క్షణాల్లో ధ్వంసం చేయగలవు. ఓడల శబ్దం లేదా అయస్కాంత సెన్సార్ల ద్వారా ఇవి పేలుతాయి. అత్యంత ఆధునికమైన రైజింగ్ టార్పెడో, ఇన్‌ఫ్లుయెన్స్ మైన్స్ శబ్దాన్ని పసిగట్టి దాడులు చేస్తాయి. శత్రువును ముంచడమే కాదు, సముద్ర ప్రయాణాన్నే అసాధ్యం చేయగల సత్తా వీటికి ఉంది.


