News December 1, 2025
ADB: 9 ఏళ్లుగా సర్పంచ్ లేడు

పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. అలాంటి పల్లెల అభివృద్ధిలో పాలకవర్గాలు కీలక పాత్ర పోషిస్తాయి. కానీ ఆ పంచాయతీకి 19 ఏళ్లుగా సర్పంచ్ లేడు. అదే తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామం. 2000 సంవత్సరంలో రుయ్యాడి గ్రామాన్ని ఏజెన్సీ ప్రాంతంగా ప్రకటించారు. దీంతో అప్పటి నుంచి అక్కడ ఎస్టీ రిజర్వేషన్ వస్తోంది. గ్రామంలో ఒక్క గిరిజనుడు కూడా లేకపోవడంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. దీంతో పల్లె అభివృద్ధి పడకేసింది.
Similar News
News February 17, 2026
తూ.గో: JEE మెయిన్స్‌లో శ్రీ ప్రకాశ్ విద్యార్థుల ప్రభంజనం

JEE మెయిన్స్ ఫలితాల్లో శ్రీ ప్రకాశ్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. జె.మోనేశ్ కుమార్ 99.93, టి.కృష్ణ 98.44 పెర్సంటైల్ సాధించినట్లు సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ్ ప్రకాశ్ తెలిపారు. తాము IIT- JEE కోచింగ్ వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. విజేతలను విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె నరసింహారావు, ప్రిన్సిపల్ వి.వి.ఎస్.ఎస్ భానుమూర్తి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.
News February 17, 2026
జేఈఈ మెయిన్స్ పరీక్షలో సత్తా చాటిన సిక్కోలు విద్యార్థి

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం విడుదల చేసిన జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి మెట్ట వెంకట సాయి సరాగ్ సత్తా చాటాడు. 99.59 పర్సంటేజ్‌తో ప్రతిభ కనబరిచాడు. మెరిట్ సాధించిన విద్యార్థుల కు జాతీయ స్థాయి ఇంజినీరింగ్ విద్యా సంస్థలైన ట్రిబుల్ ఐటీ, నిట్, జీఎఫ్‌ఐటీలలో ప్రవేశం లభిస్తుంది. దీంతో పాటు జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు.
News February 17, 2026
ఖమ్మం: కలెక్టర్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు!

ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం వివిధ శాఖల పురోగతిపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ పి.శ్రీజతో కలిసి రబీ ధాన్యం సేకరణ ఏర్పాట్లు, వేసవిలో తాగునీటి ఎద్దడి కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, రోడ్ సేఫ్టీ పనులు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.


