News April 4, 2024
నాన్ లోకల్ అభ్యర్థుల అడ్డా ‘వైజాగ్’(1/3)

ఎన్నికల్లో కుల, మతాలే కాదు.. లోకల్, నాన్ లోకల్ అంశాలు కూడా గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. ఎక్కువగా స్థానిక అభ్యర్థులనే ఓటర్లు ఎన్నుకోవడం సహజం. అయితే విశాఖ పార్లమెంట్ స్థానం దీనికి విరుద్ధం. 33 ఏళ్లుగా స్థానికేతరులే గెలుస్తున్నారు. 1952 నుంచి 1989 వరకు లోకల్ అభ్యర్థుల హవా కొనసాగగా, ఆ తర్వాతి నుంచి అన్ని పార్టీలూ నాన్ లోకల్స్‌కే సీట్లు ఇస్తున్నాయి.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News February 17, 2026
జగన్ అక్రమాస్తుల కేసులో శ్రీలక్ష్మికి చుక్కెదురు

AP: YS జగన్ అక్రమాస్తుల కేసులో IAS శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. కేసులో తన పేరును తొలగించాలన్న డిశ్ఛార్జ్ పిటిషన్‌ను SC తిరస్కరించింది. HC తీర్పును సమర్థించింది. నిబంధనలకు అనుగుణంగా తాను పనిచేశానని శ్రీలక్ష్మి విన్నవించగా రూల్స్‌ను పాటించలేదని CBI వాదించింది. శ్రీలక్ష్మి అండతో ఆమె మరిది భారీగా ఆస్తులు కూడబెట్టారని, ఆమె కూడా నేరుగా లంచం డిమాండ్ చేసినట్లు సాక్షులు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిపింది.
News February 17, 2026
AIIMS రిషికేశ్‌లో కాంట్రాక్ట్ పోస్టులు

AIIMS రిషికేశ్ 3 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BSc నర్సింగ్, బీఫార్మసీ, డీ ఫార్మసీ, BSc మెడికల్ టెక్నాలజీ, BSc (రేడియోలాజికల్ ఇమేజింగ్ టెక్నిక్స్), BSc(కంప్యూటర్ అప్లికేషన్స్) అర్హత గలవారు FEB 23 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫార్మాసిస్ట్, టెక్నీషియన్‌కు రూ.40K, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.30K చెల్లిస్తారు. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
News February 17, 2026
ధూపం ఇలా పెడితే..

ధూపంతో ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. అందులో కర్పూరం, లవంగాలు కలిపి వేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం. ‘గుగ్గులు ధూపం మనశ్శాంతిని, మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆవు పిడకలపై పసుపు ఆవాల ధూపంతో ప్రతికూల శక్తి నశిస్తుంది. సంపాదన నిలకడగా ఉండాలంటే అగరుబత్తీల ధూపం, వాస్తు దోష నివారణకు వేపాకు ధూపం ఎంతో శ్రేష్ఠం. ఈ ఆచారాలు ఇల్లాంతటా ఆధ్యాత్మిక సుగంధాన్ని, ప్రశాంతతను నింపుతాయి’ అంటున్నారు పండితులు.


