News November 19, 2025
AIని గుడ్డిగా నమ్మవద్దు: సుందర్ పిచాయ్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఇచ్చే సమాధానాలను గుడ్డిగా నమ్మవద్దని గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. AI కూడా తప్పులు చేసే అవకాశం ఉందని, ఇతర టూల్స్‌లో సమాచారాన్ని వెరిఫై చేసుకోవాలని చెప్పారు. విభిన్న మాధ్యమాలతో కూడిన సమాచార వ్యవస్థ ఉండటం ముఖ్యమని తెలిపారు. ఏఐ పెట్టుబడుల ‘బబుల్’ ఏ దశలోనైనా విస్ఫోటనం చెందవచ్చని, ఈ విషయంలో కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని BBC ఇంటర్వ్యూలో సూచించారు.
Similar News
News January 19, 2026
IREDAలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

ఇండియన్ రెనెవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్(<
News January 19, 2026
అమెనోరియా సమస్యకు కారణమిదే!

వివిధ కారణాలతో కొందరు మహిళలకు నెలసరి సమయానికి రాదు. దీన్ని అమెనోరియా అంటారు. నెలసరి లేటుగా మొదలవడాన్ని ప్రైమరీ అమెనోరియా అని, రెగ్యులర్‌గా పీరియడ్స్ రాకపోవడాన్ని సెకండరీ అమెనోరియా అని అంటారు. వంశపారంపర్యం, జన్యు కారణాలు, PCOS, ఈటింగ్ డిజార్డర్ వల్ల ఈ సమస్య వస్తుంది. ప్రారంభదశలోనే చికిత్స చేయించుకోకపోతే గర్భసంచి, గుండె సమస్యలు, బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదముంది.
News January 19, 2026
20 ఏళ్లుగా చెబుతున్నా వినలేదు.. ఇక టైమ్ వచ్చింది: ట్రంప్

గ్రీన్‌లాండ్ విషయంలో డెన్మార్క్ తీరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. ‘రష్యా నుంచి గ్రీన్‌లాండ్‌కు ముప్పు ఉందని 20 ఏళ్లుగా డెన్మార్క్‌కు నాటో చెబుతోంది. కానీ ఈ విషయంలో డెన్మార్క్ ఏమీ చేయలేదు. ఇప్పుడు సమయం వచ్చింది. అది జరిగి తీరుతుంది’ అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. గ్రీన్‌లాండ్ తమకు చాలా ముఖ్యమని, <<18784880>>అవసరమైతే సైన్యాన్ని<<>> వాడతామని వైట్ హౌస్ హెచ్చరించడం తెలిసిందే.


