News May 7, 2025
జార్జియాలో అఖండ-2 షూటింగ్

బోయపాటి శ్రీను-బాలకృష్ణ కాంబోలో రూపొందుతోన్న అఖండ-2 షూటింగ్ త్వరలో జార్జియాలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం డైరెక్టర్ లొకేషన్లను పరిశీలిస్తున్నారు. జార్జియా షెడ్యూల్‌లో బాలయ్యతోపాటు ప్రధాన నటీనటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ భావించగా అనివార్య కారణాలతో సంక్రాంతికి వాయిదా పడినట్లు సమాచారం.
Similar News
News February 17, 2026
300కు 300 మార్కులు

JEE <<19159273>>మెయిన్‌లో<<>> AP జమ్మలమడుగుకు చెందిన పసల మోహిత్ 100 పర్సంటైల్‌తో 300కు 300 మార్కులు సాధించారు. రోజుకు 4 గంటలే చదివానని, ర్యాంకుల కోసం ఒత్తిడి లేకపోవడంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. విజయవాడలో ఇంటర్ చదివిన అతడు IIT బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. మోహిత్ తండ్రి కిరణ్ కుమార్ ప్రొద్దుటూరులో వైద్యుడిగా పనిచేస్తుండగా, తల్లి సబిత జమ్మలమడుగులోని ప్రభుత్వ ఆసుపత్రిలో డెంటిస్ట్.
News February 17, 2026
ఇండియాకు మాక్రాన్.. రఫేల్ డీల్‌పై ఫోకస్!

ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భారత్ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ముంబైలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ‘హొరైజాన్ 2047 రోడ్‌మ్యాప్’లో భాగంగా డిఫెన్స్, స్పేస్, అణుశక్తి ఇలా వివిధ అంశాల్లో ఇరు దేశాల సహకారంపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపైనా భారీ డీల్ కుదిరే అవకాశం ఉంది. ఢిల్లీలో జరిగే AI సమ్మిట్‌లోనూ మెక్రాన్ పాల్గొననున్నారు.
News February 17, 2026
కర్తరీ దోషం అంటే ఏమిటి?

సూర్యుడు కృత్తికా నక్షత్రంలో సంచరించే కాలాన్ని ‘కర్తరీ దోషం’ అంటారు. దీన్నే ‘అగ్ని నక్షత్రం’ అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఇది ప్రతి ఏటా మే నెలలో వస్తుంది. ఈ సమయంలో సూర్య కిరణాలు భూమిపై నేరుగా పడతాయి. దీనివల్ల ఎండలు విపరీతంగా పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ఈ కాలాన్ని ప్రకృతి పరంగా కష్టకాలంగా భావిస్తారు. అందుకే ఈ 15-20 రోజుల పాటు ఎలాంటి కొత్త పనులు ప్రారంభించరు.


