News April 20, 2024
అయ్యో పాపం.. సత్తా ఉన్నా దురదృష్టం అడ్డుకుంది

భారత రెజర్లు దీపక్ పూనియా, సుజీత్ కల్కల్‌ను దురదృష్టం వెంటాడింది. కిర్గిస్థాన్‌లో జరిగిన ఒలింపిక్స్ క్వాలిఫైయర్స్‌లో పాల్గొనేందుకు వారిని నిర్వాహకులు అనుమతించలేదు. స్టేడియంకు ఆలస్యంగా రావడమే కారణం. వరదల కారణంగా దుబాయ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన వీరు నిన్న ఉదయం 8 గంటలకు కిర్గిస్థాన్ చేరుకున్నారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. అయితే వీరు టర్కీలో జరిగే క్వాలిఫయర్స్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంది.
Similar News
News December 11, 2025
DRDOపై స్టాండింగ్ డిఫెన్స్ కమిటీ ప్రశంసలు

హైపర్ సోనిక్ మిస్సైల్స్ తయారీ, అధునాతన టెక్నాలజీతో రక్షణ వ్యవస్థ ఏర్పాటులో DRDO సాధించిన ప్రగతిని డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది. రక్షణ పరికరాల తయారీకి విదేశాల నుంచి దిగుమతులు తగ్గించడం ద్వారా 5 ఏళ్లలో రూ.2,64,156 కోట్లు ఆదా చేసిందని రిపోర్టులో పేర్కొంది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయ రక్షణ సామర్థ్యాలను పెంచుకునేందుకు నిధులతోపాటు నైపుణ్యం ఉన్న ఉద్యోగులను DRDO కోరుతోందని తెలిపింది.
News December 11, 2025
కనకాంబరంలో పిండి నల్లి కట్టడి ఎలా?

పండ్లు, కూరగాయల పంటలను నష్టపరిచే పిండి నల్లి కనకాంబరం పంటను కూడా ఆశిస్తుంది. మొక్కల లేత కొమ్మలు, ఆకుల పూమొగ్గలు తెల్లటి పిండిలాంటి పదార్థంతో కప్పబడి ఉంటే పిండినల్లి ఆశించిందని గుర్తించాలి. ఈ పురుగులు రసం పీల్చి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు లీటర్ నీటికి 2ml డైమిథోయేట్ లేదా 2.5ml క్లోరిపైరిఫాస్ లేదా 0.3ml ఇమిడాక్లోఫ్రిడ్ కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
News December 11, 2025
మన ఊహకందనంత శక్తిమంతుడు ‘విష్ణుమూర్తి’

లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః|
చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః||
లోకాలన్నింటిలో అతి గొప్పవాడు, ధర్మానికి న్యాయ నిర్ణేత విష్ణు. జరిగిపోయింది, జరగాల్సిందంతా ఆయన చేతుల్లోనే ఉంటుంది. నాలుగు రూపాలుగా, నాలుగు పద్ధతుల్లో, నాలుగు భుజాలతో కనిపించే ఆయన మన ఊహకందనంత శక్తిమంతుడు. ఆ దైవాన్ని మనం మనసులో పెట్టుకొని భక్తితో ధ్యానిస్తే తప్పక అనుగ్రహిస్తాడు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


