News May 15, 2024

మొత్తం ఇండియా నాకు మద్దతుగా నిలిచింది: పంత్

image

తీవ్ర ప్రమాదం కారణంగా ఏడాదిన్నర పాటు క్రికెట్‌కు దూరమయ్యారు రిషభ్ పంత్. ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తనకు లభించిన మద్దతుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఏ స్టేడియంలో మ్యాచ్ ఆడినా భారతీయులంతా తనకు మద్దతుగా నిలిచారని కొనియాడారు. ఇప్పుడు 24 గంటలూ గ్రౌండ్‌లోనే ఉండాలని అనిపిస్తోందని తెలిపారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో పంత్ 13 మ్యాచుల్లో 446 పరుగులు చేశారు. వాటిలో 3 హాఫ్ సెంచరీలున్నాయి.

Similar News

News December 8, 2025

2026 DECకు పూర్తి కానున్న విశాఖ-రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే

image

విశాఖపట్నం-రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) ఎక్స్‌ప్రెస్‌వే పనులు 2026 చివరి నాటికి పూర్తి కానున్నాయి. రూ.16,482 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆర్థిక కారిడార్‌ను కేంద్రం చేపట్టింది. మొత్తం 597 KM మార్గాన్ని 465KMకి తగ్గిస్తూ 6 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేగా నిర్మిస్తోంది. దీంతో AP, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మధ్య ప్రయాణ సమయం దాదాపు 7 గంటలు తగ్గుతుంది. టూరిజం, పారిశ్రామిక రవాణా, వ్యాపార అవకాశాలకు పెద్ద ఊతం లభించనుంది.

News December 8, 2025

పాలు పితికేటప్పుడు ఇవి గమనించాలి

image

రోజూ ఒకే సమయంలో పాలు పితకాలి. ఈ సమయంలో పశువు బెదరకుండా, చిరాకు పడకుండా చూడాలి. పాల ఉత్పత్తికి అవసరమయ్యే ఆక్సిటోసిన్‌ హార్మోను మెదడు నుంచి విడుదలై రక్తప్రసరణలో 8 నిమిషాలే ఉంటుంది. అందుకే పాలను 5-8 నిమిషాల లోపే తీయాలి. దీని వల్ల పాలలో అధిక వెన్నశాతం పొందొచ్చు. పాల తొలి ధారల్ని దూడలకు తాగించి, మలి ధారలను కేంద్రానికి పోయాలి. వీటిలో సుమారు 10% వెన్న ఉంటుంది. వీటిని దూడకు తాగించడం మంచిది కాదు.

News December 8, 2025

ఇవాళ్టి మ్యాచులకు నో ఎంట్రీ!

image

HYDలోని ఉప్పల్, జింఖానా మైదానాల్లో SMATలో భాగంగా ఇవాళ 4 మ్యాచులు జరగనున్నాయి. అయితే ప్రేక్షకులను అనుమతించకూడదని HCA నిర్ణయించింది. DEC 2న పంజాబ్, బరోడా మధ్య మ్యాచ్ జరగ్గా హార్దిక్, అభిషేక్‌ను చూడటానికి భారీగా ఫ్యాన్స్ వచ్చారు. సరైన సెక్యూరిటీ లేక పలువురు గ్రౌండులోకి వెళ్లి ప్లేయర్లతో సెల్ఫీలు సైతం దిగారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల భద్రత దృష్యా ఆడియన్స్‌ను అనుమతించకూడదని నిర్ణయించినట్లు HCA తెలిపింది.