News April 24, 2024

టీ20 పండుగకు సర్వం సిద్ధం?

image

టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికా, వెస్టిండీస్ సర్వం సిద్ధం చేస్తున్నాయి. న్యూయార్క్‌లో కొత్త స్టేడియం నిర్మిస్తున్నారు. అలాగే విండీస్‌లోని స్టేడియాలకు మరమ్మతులు నిర్వహిస్తున్నారు. WCకు మరో రెండు నెలల సమయం ఉండటంతో పనులు వేగవంతం చేస్తున్నారు. కాగా జూన్ 2 నుంచి టీ20 WC ప్రారంభం కానుంది. మొత్తం 20 జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి. జూన్ 9న న్యూయార్క్‌లో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది.

Similar News

News December 16, 2025

వెంకటేశ్ అయ్యర్‌కు రూ.7 కోట్లు

image

IPL-2026 మినీ వేలంలో వెంకటేశ్ అయ్యర్‌ను RCB రూ.7 కోట్లకు దక్కించుకుంది. గత మెగా వేలంలో ఇతడిని కోల్‌కతా రూ.23.75 కోట్లకు దక్కించుకుంది. మినీ వేలానికి ముందు రిలీజ్ చేసింది. దీంతో వేలానికి వచ్చిన అయ్యర్‌ను ఆర్సీబీ సొంతం చేసుకుంది. అటు రూ.75 లక్షల బేస్ ప్రైస్ ఉన్న ఆల్‌రౌండర్ దీపక్ హుడా అన్‌సోల్డ్‌గా మిగిలారు.

News December 16, 2025

అసౌకర్యంగా అనిపిస్తుంది.. కాంతార ఇమిటేషన్‌పై రిషబ్ శెట్టి

image

కాంతార సీన్‌ను బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ కామెడీగా <<18446778>>అనుకరించడం<<>>పై దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి పరోక్షంగా స్పందించారు. అలా చేయడం తనను అసౌకర్యానికి గురిచేస్తుందని రణ్‌వీర్ పేరెత్తకుండా చెప్పారు. ‘కాంతార దైవిక అంశాలతో రూపొందిన సినిమా. సున్నితమైన, పవిత్రమైన విషయం. దానితో మాకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది. అందుకే మూవీ సన్నివేశాలను ఇమిటేట్ లేదా ఎగతాళి చేయవద్దని కోరుతుంటా’ అని ఓ ఈవెంట్‌లో పేర్కొన్నారు.

News December 16, 2025

వంటింటి చిట్కాలు మీకోసం

image

* కూరల్లో పెరుగు వేసేటప్పుడు నేరుగా కలపకుండా, ఒక కప్పులో వేసి స్పూన్‌తో చిలికి వెయ్యాలి. అప్పుడే గ్రేవీ మొత్తానికి చిక్కదనం వస్తుంది.
* పాలు మాడకుండా ఉండాలంటే కాచే ముందు గిన్నెలో కొద్దిగా చన్నీరు పోసి వంపేయాలి.
* అల్లం, వెల్లుల్లి పేస్ట్ నిల్వ ఉండాలంటే దాంట్లో కొద్దిగా ఉప్పు, కాస్త వేడి నూనె వేయాలి.
* గుడ్లు ఉడికించేటప్పుడు కాస్త నూనె వేస్తే పగలకుండా ఉంటాయి.