News August 21, 2025

ALLERT: రెండో హెచ్చరిక జారీ.. భద్రాద్రి కలెక్టర్ ఆదేశాలు

image

భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయిన నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. అధికారులు ఇప్పటికే పునరావాస చర్యలు చేపట్టారని, అవసరమైతే మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజలకు తాగునీరు, ఆహారం, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా వంటి అన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News January 22, 2026

వైద్య రంగంలో సరికొత్త విప్లవం..!

image

ఐఐటీ బాంబే & IIT మండి శాస్త్రవేత్తలు చిన్న రోబోల సహాయంతో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని కనిపెట్టారు. బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు నీటిలోకి వెళ్లి, ఒకేసారి దిశ మార్చుకుంటూ ఎలా ఈదుతాయో ఈ రోబోల ద్వారా విజయవంతంగా గుర్తించారు. జీవుల ప్రాథమిక కదలికలను అర్థం చేసుకోవడానికి ఈ ప్రయోగం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి నానో రోబోలు మానవ రక్తనాళాల్లోకి వెళ్లి వ్యాధి ఉన్న చోటే మందులు అందించేలా ప్రయోగాలు చేయనున్నారు.

News January 22, 2026

YS జగన్‌పై ఫైర్ అయిన మంత్రి గొట్టిపాటి

image

క్యారెక్టర్ లేని జగన్ క్రెడిట్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ గురువారం విమర్శించారు, ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఏం చేశారని క్రెడిట్ ఇవ్వాలని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడంలోనే జగన్ క్రెడిట్, విద్యుత్తు రంగాన్ని సర్వనాశనం చేసినందుకు జగన్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే అంటూ సెటైర్లు వేశారు.

News January 22, 2026

IITల్లో ఆగని ఆత్మహత్యలు.. మానసిక సమస్యలే కారణమా!

image

దేశవ్యాప్తంగా ఉన్న IITల్లో విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. IIT కాన్పూర్‌లో మంగళవారం మరో స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నారు. రెండేళ్ల వ్యవధిలో ఇదే క్యాంపస్‌లో 9మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుల, భాషా వివక్ష, ఒంటరితనం, పోటీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో సూసైడ్‌ చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆత్మహత్యల నివారణ, కారణాలను తెలుసుకునేందుకు సుప్రీంకోర్టు ఇప్పటికే టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసింది.