News March 22, 2024
ALP: నాకు కోర్టు నోటీసులు రాలేదు: ఎమ్మెల్యే విజయుడు

హైకోర్టు నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో తన ఎన్నిక చెల్లదని హైకోర్టు నోటీసులు పంపింది అంటూ వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందే ఉద్యోగానికి రాజీనామా చేశానని చెప్పారు. తాను చేసింది తాత్కాలిక ఉద్యోగం అని, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగం కాదని గ్రహించాలని హితవు పలికారు.
Similar News
News April 11, 2026
మహబూబ్‌నగర్: విద్యతోనే మహిళా సాధికారత: కలెక్టర్

సమాజంలో మహిళలు విద్య ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని కలెక్టర్ కుష్బూ గుప్తా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి, స్త్రీ విద్యకు ఫూలే చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో మేయర్ మమత, డి.మేయర్ సురేందర్, ముడా ఛైర్మన్ లక్ష్మణ్ పాల్గొన్నారు.
News April 11, 2026
MBNR: భానుడి భగభగలు.. 41.1 డిగ్రీలు నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాలో వేసవి ఎండలు ప్రచండ రూపం దాల్చుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. గడిచిన 24 గంటల్లో చిన్నచింతకుంటలో అత్యధికంగా 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కోయిలకొండ (41.0), కౌకుంట్ల (40.9) ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత అధికంగా ఉంది. భూత్పూర్, మిడ్జిల్, మహమ్మదాబాద్ మండలాల్లో సగటున 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవడంతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.
News April 10, 2026
మహబూబ్‌నగర్: రోడ్డు భద్రతపై వీడియో పోటీలు

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు “Arrive Alive” పేరుతో వీడియో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకి తెలిపారు. గరిష్ఠంగా 3 నిమిషాల నిడివి గల వీడియోలను రూపొందించి, ఈ నెల 14లోపు ఎస్పీ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఉత్తమ వీడియోకు రూ.5,000 నగదు బహుమతి అందజేస్తామని, ప్రమాదాల నివారణే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.


