News April 25, 2024

నేడు సిద్దిపేటలో అమిత్ షా సభ

image

TG: లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం BJP అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నారు. ఇవాళ సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. మరోవైపు PM మోదీ ఈనెల 30న జహీరాబాద్, మెదక్ లోక్‌సభ స్థానాలకు కలిపి సుల్తాన్‌పూర్‌లో నిర్వహించే సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మే 3న చౌటుప్పల్, 4న నారాయణపేట, వికారాబాద్ లేదా మరో ప్రాంతంలో జరిగే సభలో పాల్గొంటారు. తర్వాత కూడా మరో 2-3 రోజులు ప్రచారం నిర్వహిస్తారని సమాచారం.

Similar News

News April 13, 2026

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు.. UPDATE

image

AP: రాష్ట్రంలో 87 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లలో <<19603357>>డీలిమిటేషన్<<>> ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం వార్డులు, డివిజన్లు 3,206 ఉండగా 2011 జనాభా లెక్కల ప్రకారం మరో 736 పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆ సంఖ్య 3,942కు చేరనుంది. ఈ ప్రక్రియ ముగియగానే ఆగస్టు, సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని SEC భావిస్తోంది. ఇక మరో 23 పట్టణ స్థానిక సంస్థలకు కోర్టు కేసులు తేలాక ఎలక్షన్స్ నిర్వహించనుంది.

News April 13, 2026

ALERT: ఈ చిన్న తప్పుతో గుండెపోటు రావొచ్చు

image

నిద్ర విషయంలో సమయపాలన లేకపోతే గుండెపోటు ముప్పు రెట్టింపు అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘కేవలం ఎన్ని గంటలు నిద్రపోయామనేది కాకుండా, రోజూ ఒకే సమయానికి పడుకోవడం చాలా ముఖ్యం. ‘నిద్రపోయే సమయంలో 1-2గంటలు తేడా వచ్చినా జీవ గడియారం దెబ్బతింటుంది. ఇది గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ రాత్రి ఒకే టైమ్‌కు నిద్రపోవడం అలవాటు చేసుకోండి’ అని సూచిస్తున్నారు.

News April 13, 2026

స్మార్ట్ గవర్నెన్స్.. సింగపూర్‌కు 9 మంది మంత్రులు

image

AP: ప్రజలకు స్మార్ట్ గవర్నెన్స్‌ను అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా 9 మంది మంత్రులు, ఉన్నతాధికారులకు ట్రైనింగ్ ఇప్పించనుంది. ఈ నెల 21 నుంచి 27 వరకు నారాయణ, అచ్చెన్న, నాదెండ్ల, సత్యకుమార్, అనగాని, నిమ్మల, పయ్యావుల, అనిత, జనార్దన్ సింగపూర్‌లో పర్యటించనున్నారు. రోజుకొక అంశంపై వారం రోజులపాటు శిక్షణ ఉంటుంది. వారు తిరిగొచ్చాక ఇతర ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తారు.