News February 19, 2025

AMP: అర్జీదారులకు పరిష్కార మార్గాలు చూపాలి

image

కోనసీమ జిల్లాలో రెవెన్యూ సదస్సులు, రీ సర్వే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులపై స్పందించి సకాలంలో పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద తహాసిల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించి భూ పరిపాలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక అంశాలపై సమీక్షించారు. ఆ అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.

Similar News

News March 23, 2025

ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమయాల్లో మార్పులు 

image

తిరుపతి కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగే సమయాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సోమవారం 24వ తేది నుంచి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. ఈ మార్పును జిల్లా వాసులు గమనించాలని ఆయన కోరారు. 

News March 23, 2025

హీరోయిన్‌తో టాలీవుడ్ డైరెక్టర్ డేటింగ్?

image

సినీ పరిశ్రమలో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తమిళ హీరోయిన్ బ్రిగిడా సాగాతో డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తన భార్యతో దూరంగా ఉంటున్న ఆయన ఇటీవల బ్రిగిడకు దగ్గరయ్యారని సినీ వర్గాలంటున్నాయి. ఈ పుకార్లపై వారు స్పందించాల్సి ఉంది. కాగా బ్రిగిడాతో శ్రీకాంత్ పెదకాపు-1 సినిమాను తెరకెక్కించారు. ఆ మూవీ సమయంలోనే వారి మధ్య స్నేహం చిగురించిందని సమాచారం.

News March 23, 2025

కరీంనగర్: గీత ఐస్ క్రీమ్.. ఓ మధుర జ్ఞాపకం

image

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఆ రోజుల్లో గీత ఐస్ క్రీమ్ లేకుండా కాలం గడిచేది కాదు. ఒక్క రూపాయికి మాత్రమే లభించే గీత ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, పెప్సీ ఐస్ క్రీమ్‌లు ప్రస్తుత రోజుల్లో మధుర జ్ఞాపకంగా మారిపోయాయి. వందల రూపాయలు పెట్టి ఐస్ క్రీములు తిన్నప్పటికీ గీత ఐస్ క్రీమ్ మర్చిపోలేమని ఇప్పటికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. మీ చిన్నతనంలో గీత ఐస్ క్రీమ్ తిన్నారా? తింటే.. కింద కామెంట్ చేయండి..!

error: Content is protected !!