News April 23, 2025
AMP: ఇంటర్ ఫీజు గడువు 25 వరకు పొడిగింపు: DEO

ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 25 వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి సోమశేఖరరావు మంగళవారం తెలిపారు. నేటితో ముగిసిన గడువును పొడిగించామన్నారు. ఫెయిల్ అయినవారు, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, ఇంప్రూవ్మెంట్ రాయదలుచుకున్నవారు, 25 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. రీకౌంటింగ్, రివెరిఫికేషన్‌కి కూడా ఇదే తేదీ వర్తిస్తుందన్నారు.
Similar News
News March 11, 2026
అనంత: ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన M.Tech 1-1 (R25) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్‌తో కలిసి ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు కళాశాలలోని అకడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.
News March 11, 2026
వెలుగుమట్ల వివాదం.. ఎక్కడ కూల్చారో అక్కడే వారికి ఇళ్లు

గత రెండు వారాలుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విపక్షాల ఆందోళనలతో ఎక్కడైతే ఇళ్లు కూల్చారో, అక్కడే 9 ఎకరాల్లో లేఅవుట్ చేసి 311 మంది బాధితులకు 75 గజాల చొప్పున పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలో నేడు పట్టాల పంపిణీ చేపట్టనుంది. ఈ పరిణామం ప్రభుత్వానికి ఎంతవరకు మైలేజీ ఇస్తుందో వేచి చూడాలి.
News March 11, 2026
చిన్న సంస్థ.. పెద్ద దెబ్బ: అమెరికా యుద్ధ రహస్యాలు లీక్

చైనాకు చెందిన మిజార్‌విజన్ అనే చిన్న సంస్థ AI సాయంతో అమెరికా యుద్ధ వ్యూహాలను బట్టబయలు చేసింది. ఫిబ్రవరిలో ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ప్రారంభానికి ముందే ఇజ్రాయెల్, సౌదీలోని అమెరికా వైమానిక స్థావరాలు, యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థల హై-రిజల్యూషన్ ఫొటోలను ఈ సంస్థ SMలో విడుదల చేసింది. జిలిన్-1 ఉపగ్రహాల ద్వారా సేకరించిన ఈ సమాచారం ఇరాన్ దాడులకు పరోక్షంగా సహకరించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.


