News May 7, 2025

AMP: గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

image

అమలాపురం రూరల్ మండలం నడిపూడి కాలువలో శుక్రవారం గల్లంతైన సురేశ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. శ్రీరామ్ నగర్‌కు చెందిన సురేశ్ ప్రమాదవశాత్తు ప్రధాన పంట కాలువలో కాలుజారి పడ్డాడు. అతని కోసం స్థానికులు, పోలీసులు ముమ్మరంగా గాలించిన ఆచూకీ లభించలేదు. శనివారం నడిపూడి లాకు వద్ద మృతదేహం తేలడంతో పోలీసులు బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ శేఖర్ బాబు తెలిపారు.

Similar News

News February 11, 2026

గోళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే అధిక కొలెస్ట్రాల్

image

బాడీలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగినప్పుడు గోళ్లలో మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గులాబీ రంగులో ఉండే గోళ్లు రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడంతో రంగుమారి పాలిపోయినట్టు/తెల్లగా కనిపిస్తాయి. ఒనికోరెక్సిస్ అని పిలిచే గాట్లు ఏర్పడతాయి. రక్త ప్రవాహం తగ్గడంతో పెరుగుదలకు కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఒంకరగా పెరుగుతాయి. కొందరిలో నీలం/ఊదా రంగులో కనిపిస్తాయి.

News February 11, 2026

తెల్లకాకిని మీరెప్పుడైనా చూశారా?

image

ఆదోని మండలం సంతెక్కుడ్లూరు గ్రామంలో మంగళవారం అరుదైన తెల్లకాకి ప్రత్యక్షమైంది. మారెమ్మ అవ్వ దేవాలయం వద్ద కనిపించిన ఈ కాకిని చూసేందుకు గ్రామస్థులు ఆసక్తి కనబరిచారు. సాధారణంగా నల్లగా ఉండే కాకి ఇలా తెల్లగా ఉండటం వెనుక ఆల్బినిజం (Albinism) అనే జన్యుపరమైన మార్పు కారణమని నిపుణులు చెబుతున్నప్పటికీ, స్థానికులు మాత్రం దీనిని వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన ఫలితంగా భావిస్తూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

News February 11, 2026

మెదక్: నేడు సెలవు మంజూరు: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికలలో ఓటర్లుగా ఉన్న వారందరికీ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేసిందని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పోలింగ్ రోజున తప్పనిసరిగా ఓటు వేయాలని ఆయన సూచించారు. ఈ ఉత్తర్వులతో ఉద్యోగులందరికీ ఓటు వేసే మార్గం సుగమమైంది.