News March 7, 2025

AMP: పదో తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం

image

ఈ నెల 17 నుంచి 31వ వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతాయని డీఈవో SK సలీం భాషా శుక్రవారం తెలిపారు. SSC పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. హాల్ టికెట్ ఆధారంగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులలో ఉచిత ప్రయాణాన్ని అనుమతించడం జరుగుతుందన్నారు. పరీక్షలు జరిగే అన్ని రోజుల్లో విద్యార్థులకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని, దీనిపై ఆదేశాలు జారీ అయ్యాయన్నారు.

Similar News

News March 20, 2025

NLG: మే నాటికి ఐదు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి: భట్టి

image

ఈ ఏడాది మే నెల నాటికి ఉమ్మడి జిల్లాలో యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్లోని ఐదు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే రెండు యూనిట్లలో విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించినట్లు మంత్రి పేర్కొన్నారు.

News March 20, 2025

BUDGET.. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులకే ప్రాధాన్యం

image

రాష్ట్ర బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. KLIకు రూ.800కోట్లు, కోయిల్‌సాగర్ రూ. 80.73కోట్లు, నెట్టెంపాడుకు రూ.144కోట్లు, సంగంబండకు రూ.98.08కోట్లు కేటాయించింది. నల్లమలలో పర్యాటక అభివృద్ధికి రూ.242 కోట్లు ఇవ్వగా.. పాలమూరు ప్రాజెక్టుకు రూ.1715కోట్లు దక్కాయి. పాలమూరు వర్సిటీకి రూ.50కోట్లు ఇచ్చింది. బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వస్తోంది.

News March 20, 2025

నరసరావుపేట: వర్క్ ప్రెజర్ వల్లే ఆత్మహత్య?

image

నరసరావుపేటలో బల్లికురవ(M) గుడిపాడుకు చెందిన బండ్ల హనుమంతరావు(29) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఆత్మహత్యకు పని ఒత్తిడే కారణమని సమాచారం. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న ఆయన.. వర్క్ ప్రెజర్ వల్ల జాబ్ చేయలేకపోతున్న అంటూ సూసైడ్ నోట్‌లో రాసినట్లు తెలుస్తోంది. ఉద్యోగం వదిలేస్తే భార్య తరఫు బంధువులు మాటలు అంటారేమో అని, అమ్మ, నాన్న క్షమించండి అని సూసైడ్ నోట్‌లో రాసినట్లు సమాచారం.

error: Content is protected !!