News February 19, 2025

AMP: 69 గ్రామ సచివాలయాల్లో ఆధార్ స్పెషల్ డ్రైవ్ 

image

జిల్లాలో 69 గ్రామ వార్డు సచివాలయాల్లో శుక్రవారం వరకు జిల్లాలో ప్రత్యేక ఆధార్‌ డ్రైవ్‌ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ మహేష్ కుమార్ తెలిపారు. ఈ డ్రైవ్‌ లో కొత్తగా జన్మించిన శిశువుల న్యూ ఆధార్‌ ఎన్రోల్మెంట్, 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల మధ్యలో జరగవలసిన మాండేటరీ బయోమెట్రిక్, 15సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల లోపల జరగాల్సిన మాండేటరీ బయోమెట్రిక్, ఈ రెండు రకాల బయోమెట్రిక్‌ అప్డేట్ చేస్తారన్నారు.

Similar News

News April 14, 2026

ADB: రేపు జిల్లాకు మంత్రి పొన్నం రాక

image

రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఈ నెల 15న ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా బుధవారం ఆదిలాబాద్‌లో నిర్వహించే పలు కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. ఈ మేరకు ఆర్టీవో అధికారులు మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను చేపడుతున్నారు.

News April 14, 2026

IPL: త్వరలోనే SRH జట్టులోకి కమిన్స్?

image

SRH కెప్టెన్ పాట్ కమిన్స్ జట్టులోకి ఎప్పుడు తిరిగొస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇండియా వచ్చి మళ్లీ ఆస్ట్రేలియా వెళ్లిన ఆయనకు రేపు అక్కడ ఫిట్‌నెస్ టెస్ట్ జరగనున్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. ఈ నెల 17న ఆయన ఇండియాకు వస్తారని తెలిపింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఆయన జట్టులో చేరే అవకాశం ఉంది. కొన్ని నెలలుగా ఆయన వెన్నునొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

News April 14, 2026

రంగారెడ్డిలో 40 దాటింది.. జాగ్రత్త!

image

రంగారెడ్డిలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఇబ్రహీంపట్నం పరిధి దండుమైలారంలో గరిష్ఠంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మాడ్గుల్, ఎలిమినేడు ప్రాంతాల్లో 41.7 డిగ్రీలు, బోడకొండ, రాచులూరు ప్రాంతాల్లో 41.6 డిగ్రీలు నమోదయ్యాయి. యాచారం, మొయినాబాద్, కడ్తాల్ ప్రాంతాల్లో కూడా 41 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎండలో బయటకు వెళ్లకపోవడం మంచిదని నిపుణులు సూచించారు.
SHARE IT