News January 5, 2025
విశ్వవేదికలపై మెరిసిన భారతీయ తార
బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొణె విశ్వవేదికలపై భారత కీర్తిని చాటారు. 2022 ఫిఫా WC ట్రోఫీని ఆవిష్కరించి, ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా నిలిచారు. ఆ మరుసటి ఏడాది 2023లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో తళుక్కున మెరిశారు. తెలుగు సినిమా RRRలోని ‘నాటు నాటు’ పాటకు అవార్డు వచ్చినట్లు ఆమె స్వయంగా స్టేజీపై ప్రకటించారు. 2022లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ మెంబర్‌గానూ దీపిక వ్యవహరించారు. ఇవాళ దీపిక బర్త్‌డే.
Similar News
News January 23, 2025
మహా కుంభమేళా.. 10 కోట్ల మంది పుణ్యస్నానాలు
ప్రయాగ్‌రాజ్ (UP) మహా కుంభమేళా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు త్రివేణి సంగమంలో 10 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. మొత్తం 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
News January 23, 2025
సీనియర్ ప్లేయర్లకు చుక్కలు చూపించిన జమ్మూ పేసర్
ముంబైతో జరిగిన రంజీ మ్యాచులో జమ్మూ కశ్మీర్ పేసర్ ఉమర్ నజీర్ సీనియర్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. రోహిత్ శర్మ(3), అజింక్య రహానే(12), శివమ్ దూబే(3), హార్దిక్ తామూర్(7)లను స్వల్ప స్కోరుకే పెవిలియన్ పంపారు. వారు క్రీజులో ఏమాత్రం కుదురుకోకుండా నిప్పులు చెరిగే బంతులతో చెలరేగారు. కాగా పుల్వామాకు చెందిన 31 ఏళ్ల ఉమర్ 2013 నుంచి క్రికెట్ ఆడుతున్నారు. గతంలో ఇండియా-సి జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించారు.
News January 23, 2025
‘ఏమైనా సరే.. FEB 20లోపు డెలివరీ చేయండి’
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన <<15211801>>కొత్త రూల్<<>>తో అక్కడి ఇండోఅమెరికన్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి 20లోపు జన్మించే పిల్లలకు మాత్రమే అక్కడి పౌరసత్వం లభించనుంది. దీంతో ఇప్పటికే గర్భంతో ఉన్నవారు ఫిబ్రవరి 20లోపు డెలివరీ జరిగేలా వైద్యులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. నెలలు నిండకుండానే సి-సెక్షన్లు చేయాల్సిందిగా వైద్యులకు రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపింది.