News March 26, 2024
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ నుంచి అప్డేట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. చరణ్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌లో జోష్ నింపేందుకు మేకర్స్ మూవీ నుంచి ‘జరగండి’ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్‌ను విడుదల చేశారు. రేపు ఉదయం 9 గంటలకు సాంగ్ విడుదలవుతుందని ప్రకటించారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Similar News
News February 7, 2026
దీపారాధన: ఎన్ని వత్తులకు ఏ ఫలితం?

దీపారాధనలో వత్తుల సంఖ్యను బట్టి ఫలితాలుంటాయి. 2 వత్తులు కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తే, 3 ఉత్తమ సంతానాన్ని, 5 పంచభూతాల అనుగ్రహాన్ని కలిగిస్తాయి. 7 వత్తులు 7 జన్మల పాపాలను పోగొడతాయి. 8 వత్తులు అష్టైశ్వర్యాలను, 9 కీర్తి ప్రతిష్ఠలను ఇస్తాయి. 10 వత్తులు సర్వాంతర్యామికి సంకేతం. 27 వత్తులు నక్షత్ర ఫలితాలను, 108 సర్వ అరిష్టాల నివారణను, 360 వత్తులు ఏడాది పొడవునా దీపారాధన చేసిన పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాయి.
News February 7, 2026
Rose day: గులాబీ ‘రంగులు’ తెలుసా?

ప్రేమికులకు ఇష్టమైన వాలంటైన్స్ వీక్ నేటి నుంచి మొదలైంది. తొలి రోజును Rose dayగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫీలింగ్స్‌ను వ్యక్తపరిచేందుకు రంగురంగుల రోజాలను తమకు ఇష్టమైనవారికి ఇస్తారు.
* ఎర్ర గులాబీ-ప్రేమకు చిహ్నం * తెలుపు-అమాయకత్వం, స్వచ్ఛత * పసుపు-ఆనందం, స్నేహం, పింక్- ప్రశంస, కృతజ్ఞత * బ్లూ కలర్-విడిచిపెట్టకుండా ఉండలేకపోవడం, * గ్రీన్ రోజ్- సంపద, ప్రశాంతత * నల్ల గులాబీ- తిరస్కరణ, విచారం.
News February 7, 2026
ధనప్రాప్తి కలగాలంటే ఏం చేయాలంటే?

ధనప్రాప్తి కలగడానికి కొన్ని ఆచారాలు పాటించాలి. రోజూ పూజ చేసే సమయంలో ‘శ్రీ సూక్తం’ పఠించాలి. అమ్మవారిని ఉపాసిస్తూ ఓ లవంగాన్ని ఆమె వద్ద ఉంచడం శుభప్రదం. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. ప్రతి శనివారం విరిగిన వస్తువులను పారేసి, బూజు దులపాలి. పూజ గదిలో ‘ఏకాక్షి కొబ్బరికాయ’ ఉంచడం వల్ల సంపద పెరుగుతుంది. ఉదయం నిద్రలేవగానే రెండు అరచేతులను చూసుకుని కళ్లకు అద్దుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.


