News May 7, 2025
ఆంధ్రా వర్సిటీకి వందేళ్లు

విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయానికి నేటితో వందేళ్లు. ఎన్నో పోరాటాల కారణంగా 1926 ఏప్రిల్ 26న తొలుత విజయవాడలో ఇది ఏర్పాటైంది. 1930లో దీన్ని విశాఖకు తరలించారు. 450 ఎకరాల్లో కొనసాగుతోన్న వర్సిటీలో 59 దేశాలకు చెందిన వెయ్యి మంది విద్యార్థులు సహా దాదాపు 20వేల మంది(అనుబంధ కాలేజీలతో కలిపి) విద్యనభ్యసిస్తున్నారు. సీవీ రామన్, సీఆర్ రావు, వెంకయ్య, చలమేశ్వర్, గ్రంథి మల్లికార్జునరావు తదితరులు ఇక్కడే చదివారు.
Similar News
News February 18, 2026
జిల్లాలో భూసేకరణ వేగవంతం చేయాలి: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలో నేషనల్ హైవే ప్రాజెక్టుల పురోగతిపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. ధంసలాపురం ఎంట్రీ, ఎగ్జిట్‌కు 1.38 ఎకరాల భూసేకరణ త్వరగా పూర్తి చేసి మార్చి 15లోపు పనులు ముగించాలని ఆదేశించారు. నాగపూర్- అమరావతి హైవే ప్యాకేజీలకు కొనిజర్ల, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో భూ స్వాధీనం వేగవంతం చేయాలన్నారు. 17 జంక్షన్ల రోడ్డు భద్రతా పనులు నెలాఖరుకు పూర్తి చేయాలని సూచించారు.
News February 18, 2026
పంచాయతీల్లో ఓటుహక్కు నమోదు ఇకపై ఏడాదికి 4సార్లు

AP: పంచాయతీల్లో ఓటుహక్కు నమోదు ఏడాదికి 4సార్లు నిర్వహించేలా చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఇప్పటివరకు JAN 1న మాత్రమే ఓటరు నమోదు జరుగుతోంది. తరువాత పుట్టిన వారు ఏడాది పాటు వేచి ఉంటున్నారు. ఈ బిల్లుతో ఇకపై JAN, APR, JUL, OCT నెలల్లో 1న ఓటు నమోదు చేసేలా చట్టాన్ని సవరించారు. మంత్రి కందుల దుర్గేశ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అసెంబ్లీ, మున్సిపల్ ఓట్ల నమోదు కూడా ఏటా 4సార్లు చేస్తున్నారు.
News February 18, 2026
మరోసారి అభిషేక్ డకౌట్

T20WC: భారత డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశ పరిచారు. పసికూన నెదర్లాండ్స్‌పై పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగారు. ఇన్నింగ్స్ మూడో బంతికే ఆర్యన్ దత్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యారు. కాగా అభిషేక్ ఈ ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ డకౌట్ కావడం గమనార్హం.


