News May 14, 2024

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్!

image

వాట్సాప్‌లో ‘ఆటోప్లే యానిమేటెడ్ ఇమేజెస్’ పేరుతో ఓ ఫీచర్ రానుంది. ఎమోజీ, స్టికర్స్, అవతార్స్‌కు సంబంధించి యానిమేషన్స్‌ను ఈ ఫీచర్‌తో కంట్రోల్ చేయవచ్చు. డిజేబుల్ లేదా ఎనేబుల్ చేసుకోవచ్చు. మన ప్రాధాన్యతకు తగ్గట్లుగా యాప్‌లో చాట్ సెట్టింగ్స్‌ను మార్చుకునే వెసులుబాటును తీసుకురానున్నారు. GIFs విషయంలో మాత్రం ఇది పనిచేయదు. ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

Similar News

News December 17, 2025

పెద్దపల్లి: ఉదయం 9 వరకు పోలింగ్ ఎంతంటే..?

image

పెద్దపల్లి జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బుధవారం ఉదయం 9 వరకు 22.50 శాతం పోలింగ్ నమోదైంది. ఎలిగేడు మండలంలో 22.56 శాతం, ఓదెల మండలంలో 19.50 శాతం, పెద్దపల్లి మండలంలో 21.80 శాతం, సుల్తానాబాద్ మండలంలో 26.08 శాతం పోలింగ్ రికార్డైంది.

News December 17, 2025

RBI 93 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్

image

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) 93 పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు జనవరి 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, పీహెచ్‌డీ, సీఏ, CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rbi.org.in/

News December 17, 2025

ఆస్కార్ 2026 షార్ట్‌లిస్ట్‌లో ‘హోమ్‌బౌండ్’

image

భారతీయ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రల్లో నటించిన ‘హోమ్‌బౌండ్’ మూవీ 98వ అకాడమీ అవార్డులలో ‘ది బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్’ విభాగంలో టాప్-15లో చోటుదక్కించుకుంది. కేన్స్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఆస్కార్ రేసులోకి దూసుకెళ్లింది. పోలీస్ అవ్వాలనుకునే ఇద్దరు స్నేహితులకు ఎదురైన సవాళ్లే ఈ మూవీ కథ.