News May 1, 2024

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది..

image

వాట్సాప్‌లో ‘అకౌంట్ రెస్ట్రిక్షన్’ పేరిట మరో ఫీచర్ రానుంది. దీని ద్వారా అనుమానాస్పదంగా, హానికరంగా వ్యవహరించే ఖాతాలను వాట్సాప్ నియంత్రిస్తుంది. రెస్ట్రిక్ట్ అయిన అకౌంట్ నుంచి కొత్త వారికి మెసేజ్‌లు పంపడానికి వీలుండదు. ఆల్రెడీ చాట్ చేసిన వారికి మెసేజులు, కాల్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు వాబీటా ఇన్ఫో పేర్కొంది.

Similar News

News December 8, 2025

SKLM: PG సెట్ లేకపోయినా.. సీట్ల కేటాయింపు

image

శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో MSC ఆర్గానిక్ కెమిస్ట్రీ, MSC మెడికల్ బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వై.పొలినాయుడు ఆదివారం తెలిపారు. PG సెట్ అర్హత లేకపోయినా ఉన్నత విద్యాశాఖ ఇచ్చిన మినహాయింపులు ప్రకారం అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 8, 2025

మైసూరు పప్పు మాంసాహారమా?

image

పూజలు, వ్రతాల సమయంలో మైసూరు పప్పు తినకూడదంటారు. దీన్ని మాంసాహారంగా కూడా కొందరు భావిస్తారు. ఇందులో బద్ధకాన్ని కలిగించే తామస గుణాలుండటం అందుకు తొలి కారణం. అలాగే ఓ రాక్షసుడి రక్తం బొట్టు నుంచి ఈ పప్పు పుట్టిందని కొందరు పండితులు పేర్కొంటారు. పాల సముద్రాన్ని చిలకగా వచ్చిన అమృతాన్ని దొంగచాటుగా తాగిన సర్భాను తలను విష్ణు సుదర్శన చక్రంతో ఖండించాడట. ఆ రక్తపు చుక్కలు పడిన చోట ఇవి మొలిచాయని నమ్ముతారు.

News December 8, 2025

ఫైబ్రాయిడ్స్ లక్షణాలివే..

image

ఫైబ్రాయిడ్స్‌ ఉన్న మహిళల్లో నెలసరి స్రావంలో రక్తపు గడ్డలు కనిపించడం, నొప్పి ఉంటాయి. ఒకవేళ ఫైబ్రాయిడ్స్‌ చాలా పెద్దవిగా ఉంటే మూత్రాశయం మీద ఒత్తిడి పడి తరచూ మూత్రవిసర్జన చేయవలసి రావడం, మూత్రవిసర్జన పూర్తిగా జరగకపోవడం, జీర్ణ సమస్యలు వంటివి మొదలవుతాయి. కొన్ని రకాల ఫైబ్రాయిడ్లు గర్భసంచి లోపలి పొరల్లో ఏర్పడతాయి. వీటి వల్ల గర్భస్రావం జరిగిపోవడం, గర్భం దాల్చలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.