News February 23, 2025
కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక క్యాచులు అందుకున్న క్రికెటర్‌గా కోహ్లీ(158) రికార్డు సృష్టించారు. పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు అందుకుని ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్(156)ను విరాట్ అధిగమించారు. ఓవరాల్‌గా అత్యధిక క్యాచ్‌ల జాబితాలో జయవర్దనే(218), రికీ పాంటింగ్(160) తర్వాత మూడో స్థానంలో నిలిచారు.
Similar News
News March 24, 2025
‘గ్రూప్-1 మెయిన్స్’పై హైకోర్టులో పిటిషన్

TG: గ్రూప్-1 మెయిన్స్ రీవాల్యుయేషన్ జరిపించాలంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 18 రకాల సబ్జెక్టులుంటే 12 సబ్జెక్టుల నిపుణులతోనే దిద్దించారని తెలిపారు. 3 భాషల్లో పరీక్ష జరిగితే ఒకే నిపుణుడితో మూల్యాంకనం చేయించడం వల్ల నాణ్యత కొరవడిందని చెప్పారు. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. వాదనలు విన్న కోర్టు 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని TGPSCకి నోటీసులిచ్చింది.
News March 24, 2025
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు: MLC కవిత

MMTS రైలు <<15866506>>ఘటనపై<<>> MLC కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. బాధిత యువతికి ప్రభుత్వం అండగా నిలవడంతో పాటు మెరుగైన వైద్యం అందించాలి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం. మహిళా భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం మహిళా భద్రతపై ప్రత్యేకంగా సమీక్షించాలని సూచిస్తున్నా’ అని తెలిపారు.
News March 24, 2025
జోనర్ మార్చిన వరుణ్ తేజ్

కొంత కాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జోనర్ మార్చారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కనున్న హారర్ చిత్రంలో ఆయన నటించేందుకు పచ్చ జెండా ఊపారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంది.