News March 26, 2024
BRSకు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి మదన్ రెడ్డి?

TG: బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే, కేసీఆర్ సన్నిహితుడు మదన్ రెడ్డి ఇవాళ మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో భేటీ అయ్యారు. రేపోమాపో సీఎం రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు వెంకట్రామిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారట.
Similar News
News February 13, 2026
T20WC: USA భారీ స్కోర్

చెన్నై వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో USA చెలరేగి ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 రన్స్ చేసింది. ముక్కమల్ల సాయితేజ 79 పరుగులతో సత్తా చాటారు. మరోవైపు శుభమ్ 24 బంతుల్లోనే 48 రన్స్ చేశారు. 3 ఫోర్లు, 2 సిక్సులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే 3 వికెట్లు తీశారు.
News February 13, 2026
ఒక్క చోటా గెలవని తీన్మార్ మల్లన్న పార్టీ

TG: మున్సిపల్ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పార్టీ ఒక్కచోటా గెలవలేకపోయింది. కత్తెర గుర్తుపై TRP అభ్యర్థులు పోటీ చేశారు. తమకు BC వర్గాల మద్దతు ఉంటుందని, కనీసం 40 స్థానాలు గెలుస్తామని మల్లన్న సహా నేతలు ప్రకటించారు. కానీ ఎక్కడా ఆ పార్టీ ప్రభావం కనిపించలేదు. సూర్యాపేటలోని 2 వార్డుల్లో మాత్రమే కొంతమేర ఓట్లు వచ్చాయి. ఇవి మినహా ఇంకెక్కడా డిపాజిట్లు కూడా దక్కలేదు.
News February 13, 2026
తూర్పు దిశలో ఇల్లు కట్టుకుంటే?

తూర్పు దిక్కు ఇంటికి చాలా శుభప్రదమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. దీనివల్ల లక్ష్మీ, సరస్వతుల కటాక్షం లభిస్తాయని అంటున్నారు. ‘ఇది సూర్యుడు ఉదయించే దిశ. అందువల్ల ఇక్కడ ఉండేవారు ఆరోగ్యవంతులు, ఉత్సాహవంతులుగా ఉంటారు. ఈ దిశకు అధిపతి ఇంద్రుడు. తద్వారా సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలుంటాయి. వాస్తు నియమాలు పాటిస్తే ఆశయాలు నెరవేరి సంతృప్తికర జీవితం గడుపుతారు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>


