News November 7, 2025

ANUలో NCC పోటీలు.. గవర్నర్, సీఎం హాజరు

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ నెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అఖిల భారత ఎన్‌సీసీ ఐడియా & ఇన్నోవేషన్ పోటీలు జరగనున్నాయి. కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, ఇతర ఎన్‌సీసీ ఉన్నతాధికారులు పాల్గొంటారని యూనివర్సిటీ వీసీ ఆచార్య కంచర్ల గంగాధరరావు గురువారం తెలిపారు.

Similar News

News January 22, 2026

గణతంత్ర దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలి: జేసీ

image

మదనపల్లి కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో 77వ భారత గణతంత్ర దినోత్సవం ముందస్తు ఏర్పాట్లపై డీఆర్ఓ మధుసూదన్ రావు, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణితో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులతో జాయింట్ కలెక్టర్ శివన్నారాయణ శర్మ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. భారత గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు బాధ్యతా యుతంగా కృషి చేయాలన్నారు. వేడుకలపై అధికారులకు వివిధ పనులు అప్పగించారు.

News January 22, 2026

ఇత్తడి పూజా సామాగ్రి మెరిసిపోవాలంటే..

image

మంగళకర పూజల్లో ఇత్తడి వస్తువులది ప్రత్యేక స్థానం. కొన్ని కారణాల వల్ల వెలవెలబోయిన ఈ పాత్రలను చింతపండు గుజ్జుతో శుభ్రం చేయాలి. అందువల్ల వాటి సహజ కాంతి మళ్లీ వస్తుంది. సున్నం, ఉప్పు, వెనిగర్ మిశ్రమంతో సున్నితంగా స్క్రబ్ చేసినా మొండి మరకలు తొలగిపోతాయి. ఆ పాత్రలు మళ్లీ పుత్తడిలా మెరుస్తాయి. చివరగా వేడినీటితో కడిగి, పొడి వస్త్రంతో తుడిచి ఆరబెడితే మీ పూజా సామాగ్రి ఎల్లప్పుడూ దైవకళతో తళతళలాడుతూ ఉంటాయి.

News January 22, 2026

SKLM: KR స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

image

రథసప్తమి ఉత్సవాల నిర్వహణలో భాగంగా, శ్రీకాకుళం నగరంలోని కె.ఆర్. స్టేడియంలో జరుగుతున్న సాంస్కృతిక వేదికల నిర్మాణం, ఎగ్జిబిషన్ స్టాళ్ల ఏర్పాట్లను ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. KR స్టేడియం వద్ద వాహనాలు పార్కింగ్ విషయంలో ఎంట్రీలు, ఎగ్జిట్ అత్యవసర సమయాల్లో ప్రత్యేక మార్గాలు వినియోగంపై పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. DSP వివేకానంద, RDO కృష్ణమూర్తి ఉన్నారు.