News October 6, 2025
ANU ఖాతాలపై ఐటీ శాఖ తాఖీదులు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆదాయపు పన్నుశాఖ నుంచి రూ. 194.91 కోట్ల బకాయిల నోటీసులు రావడంతో కలకలం రేగింది. ఖాతాలు స్తంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు యుద్ధప్రాతిపదికన రూ.5 కోట్లు చెల్లించేందుకు అంగీకరించారు. అయితే ఈ నిర్ణయం పాలకమండలి అనుమతి లేకుండానే తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యవసర EC నోట్ సంతకాల సేకరణ ప్రక్రియ కూడా అనుమానాస్పదంగా మారింది.
Similar News
News January 18, 2026
కామారెడ్డి: మున్సిపల్ టికెట్ల రేసులో ‘యువ’ గళం!

కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఆసక్తికరంగా మారింది. సీనియారిటీ కంటే యువత, విద్యావంతుల వైపే రాజకీయ పార్టీలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో యువత సత్తా చాటడం, రిజర్వేషన్లతో మహిళల వాటా పెరగడంతో ఈసారి మున్సిపల్ పగ్గాలు కొత్త తరం చేతికి దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
News January 18, 2026
రామగుండంలో అతివలకు 50% శాతం సీట్లు

రామగుండం కార్పొరేషన్‌లో మహిళలకు 50% సీట్లు కల్పించారు. మొత్తం 60కి గాను 30 డివిజన్లను మహిళలకు కేటాయించారు. అధికంగా జనరల్ మహిళకు 16 (26.7%) స్థానాల్లో అవకాశం ఇచ్చారు. బీసీ మహిళకు 8 (13.33%)స్థానాలు, ఎస్సీ మహిళకు 6 (10%) స్థానాలు కేటాయించారు. మిగిలిన 30 స్థానాల్లో ఎస్టీ 1 స్థానం, ఎస్సీ జనరల్ 7 (11.67%)స్థానాలు, బీసీ జనరల్ 8 (13.33%) స్థానాలు, జనరల్ 14 (23.33%) స్థానాలు రిజర్వు చేశారు.