News November 20, 2025

ANU దూరవిద్య పీజీ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం పరిధిలో జులై, ఆగస్టులో జరిగిన పలు పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను కేంద్రం డైరెక్టర్ వెంకటేశ్వర్లు, కోఆర్డినేటర్ రామచంద్రన్ గురువారం విడుదల చేశారు. పీజీ కోర్సులకు రీవాల్యుయేషన్‌కు ప్రతి పేపర్‌కు రూ. 960 చొప్పున ఈ నెల 29లోగా ఫీజు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్సైట్ నుంచి పొందవచ్చన్నారు.

Similar News

News January 13, 2026

తిరుమలలో ఎల్లుండి నుంచి సుప్రభాత సేవ

image

తిరుమల శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు సాగిన ధనుర్మాస తిరుప్పావై పాశురాల పారాయణం బుధవారంతో ముగియనుంది. డిసెంబర్ 17వ తేదీ నుంచి శ్రీవారికి బిల్వ పత్రాలతో సహస్రనామార్చన, శ్రీవల్లి పుత్తూరు చిలుకలు అలంకరించి పూజలు చేస్తున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి యథావిధిగా వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొపుతారు.

News January 13, 2026

‘మన శంకరవరప్రసాద్ గారు’.. చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతంటే?

image

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి రూ.70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాలీవుడ్ టాక్. ఈ మూవీకి చిరు కూతురు సుష్మిత కో-ప్రొడ్యూసర్‌గా ఉన్న విషయం తెలిసిందే. కాగా 1992లో ఆపద్బాంధవుడు సినిమాకు రూ.కోటితో దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా మెగాస్టార్ రికార్డు సృష్టించారు. ఆచార్య, వాల్తేరు వీరయ్య సినిమాలకు రూ.50 కోట్లు, భోళా శంకర్‌కు రూ.63 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.

News January 13, 2026

మున్సిపాలిటీ ఓటర్లు.. అత్యధికం ఎక్కడంటే?

image

TG: రాష్ట్రంలో మొత్తం 123 మున్సిపాలిటీల్లో త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. ఈ మున్సిపాలిటీల్లో మొత్తం 2,996 వార్డులుండగా 52,43,023 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల పరంగా అత్యధికంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 3,48,051, అత్యల్పంగా వనపర్తి జిల్లాలోని అమరచింత మున్సిపాలిటీలో 9,147 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 123 మున్సిపాలిటీల్లో 113 చోట్ల మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం.