News November 12, 2025

AP న్యూస్ రౌండప్

image

* స్వచ్ఛ కార్యక్రమాల అమలులో విశాఖ పోర్టు అథారిటీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ముంబైలో కేంద్ర మంత్రి సర్బానంద చేతుల మీదుగా పోర్టు ఛైర్మన్ అంగముత్తు అవార్డు స్వీకరించారు.
* రేపటి నుంచి సత్యసాయి శతజయంతి ఉత్సవాలు జరగనున్నాయి. 19న PM మోదీ, 22న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, 23న రాష్ట్రపతి ముర్ము హాజరుకానున్నారు.
* వర్సిటీలన్నింటికీ ఒకే చట్టం తీసుకొచ్చేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు తుదిదశకు చేరుకుంది.

Similar News

News November 12, 2025

పిల్లల్ని కనేముందు కౌన్సిలింగ్ అవసరం

image

పెళ్లి తర్వాత పిల్లల ప్లానింగ్‌కు ముందు భార్యాభర్తలు కౌన్సెలింగ్‌ తీసుకోవడం ద్వారా అనవసర భయాలు తొలగిపోతాయంటున్నారు నిపుణులు. దీన్నే ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అంటారు. మధుమేహం, థైరాయిడ్, బీపీ ఉంటే ముందే గుర్తించి చికిత్స తీసుకోవాలి. సహజంగా గర్భం దాల్చలేకపోతే దంపతులిద్దరూ వైద్యులను సంప్రదించాలి. అలాగే కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ, పేరెంటింగ్‌పై అవగాహన పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

News November 12, 2025

ఒకే వేదికపైకి రష్మిక, విజయ్..! అధికారికంగా ప్రకటిస్తారా?

image

ప్రేమ, త్వరలో పెళ్లి వార్తల వేళ హీరోయిన్ రష్మిక మందన్న, హీరో విజయ్ దేవరకొండ ఇవాళ ఒకే వేదికపై కనిపించనున్నట్లు తెలుస్తోంది. రష్మిక నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరగనుంది. దీనికి విజయ్ చీఫ్ గెస్ట్‌గా వస్తారని సమాచారం. ఈ వేదికగా తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటిస్తారేమోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News November 12, 2025

బిలియనీర్ల అడ్డా ముంబై, ఢిల్లీ!

image

ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు ఉండే టాప్-10 నగరాల జాబితాలో ముంబై, ఢిల్లీ చోటు దక్కించుకున్నాయి. 119 మంది కుబేరులతో న్యూయార్క్ టాప్‌లో ఉందని హురున్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత లండన్(97), ముంబై(92), బీజింగ్(91), షాంఘై(87), షెంజెన్(84), హాంకాంగ్(65), మాస్కో(59), ఢిల్లీ(57), శాన్‌ఫ్రాన్సిస్కో(52) ఉన్నాయి.