News June 17, 2024

24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

image

AP: రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 24 నుంచి 26 వరకు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 19 నుంచే అసెంబ్లీ ప్రారంభం కావాల్సి ఉండగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సెలవులో ఉండటంతో మార్పు చేశారు. 24న ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకున్న తర్వాత నూతన శాసనసభ్యుల ప్రమాణస్వీకారం జరగనుంది.

Similar News

News January 23, 2026

WPL: యూపీపై గుజరాత్ విజయం

image

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్‌పై గుజరాత్ 45 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 153/8 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యూపీ 108 రన్స్‌కే కుప్పకూలింది. GG బౌలర్లలో రాజేశ్వరి 3, రేణుక, సోఫీ చెరో 2, కేశ్వీ, గార్డ్‌నర్ తలో వికెట్ తీశారు. ఈ ఓటమితో యూపీ ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టం అయ్యాయి.

News January 23, 2026

ముగిసిన దావోస్ పర్యటన.. రేపు HYDకు చంద్రబాబు

image

AP CM చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని స్వదేశానికి బయల్దేరారు. నాలుగు రోజుల పర్యటనలో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పలు కంపెనీల అధిపతులతో భేటీ అయ్యారు. మొత్తం 36కు పైగా సమావేశాల్లో పాల్గొన్నారు. రేపు ఉదయానికల్లా ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి అమరావతి వెళ్తారు.

News January 23, 2026

పీవీ సింధుపై సీఎంల ప్రశంసలు

image

ఇంటర్నేషనల్ కెరీర్‌లో 500 విజయాలు సాధించిన తొలి భారతీయురాలిగా ఘనత వహించిన స్టార్ షట్లర్ పీవీ సింధుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆట పట్ల ఆమె అంకితభావం, పట్టుదలను రేవంత్ కొనియాడారు. సింధు ఘనత దేశానికి గర్వకారణమన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.