News September 11, 2025

AP CRDAకు ప్రతిష్టాత్మక అవార్డు

image

GIS- జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం, RSA- రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్ టెక్నాలజీల వినియోగంలో ఉత్తమ ప్రతిభకుగాను ప్రతిష్టాత్మక Best User Organization అవార్డు CRDAకు లభించింది. HYDలో Esri India సంస్థ ఈ అవార్డు అందించగా CRDA ప్లానింగ్ డైరెక్టర్ బి.సురేశ్, సిబ్బంది స్వీకరించారు. అమరావతి నిర్మాణం, అభివృద్ధిలో జియోస్పేషియల్ టెక్నాలజీ వినియోగిస్తున్నందుకుగాను ఈ అవార్డు లభించిందని CRDA కమిషనర్ తెలిపారు.

Similar News

News December 11, 2025

BREAKING: కాంగ్రెస్ సపోర్ట్.. లగచర్లలో సర్పంచ్ ఈయనే!

image

వికారాబాద్ జిల్లాలో ఉత్కంఠను రేపిన లగచర్లలో కాంగ్రెస్ మద్దతుదారుడు ఘన విజయం సాధించారు. ఇక్కడ గెలిచేందుకు ప్రత్యర్థులు సర్వ శక్తులు ఒడ్డినా.. చివరి నిమిషంలో వెంకట్రాములు గౌడ్ 15 ఓట్ల తేడాతో గెలుపొందారు. BRS బలపరిచిన గుండెమోని బసప్ప ఓటమి చవిచూశారు. దీంతో వెంకట్రాములుకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేశాయి.

News December 11, 2025

జగిత్యాల: 89 మంది ఎన్నికల సిబ్బందికి షోకాజ్ నోటీసులు

image

జగిత్యాల జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా ఎన్నికల విధులు కేటాయించగా.. గైర్హాజరైన 89 మంది ఎన్నికల సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.

News December 11, 2025

MDK: డ్రాలో వరించిన సర్పంచ్ పదవి

image

మెదక్ జిల్లా టేక్మాల్ మండలం సూరంపల్లి సర్పంచ్ పదవి డ్రాలో వరించింది. గ్రామంలో మొత్తం 596 ఓట్లు ఉండగా 558 ఓట్లు పోలయ్యాయి. అందులో 6 ఓట్లు చెల్లలేదు. బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన మైలారం పోచయ్యకు 276, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన కొండ రాంచందర్‌కు 276 ఓట్లు వచ్చాయి. ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో వారి సమ్మతితో ఎన్నికల రిటర్నింగ్ అధికారి డ్రా తీయగా పోచయ్యకు విజయం వరించింది.