News November 19, 2025
APK ఫైల్.. హైదరాబాదీల రూ.16లక్షలు స్వాహా

సైబర్ నేరగాళ్లు APK ఫైల్ పంపి ఫోన్లను హ్యాక్ చేస్తూ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. నగరానికి చెందిన ఐదుగురు ఖాతాల నుంచి రూ.16.31 లక్షల కాజేయగా.. బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకేరోజులో 5 కేసులు నమోదు కావడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకొని సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు.
Similar News
News January 18, 2026
హైదరాబాద్ మళ్లీ ‘ఆమె’దే!

త్వరలో ఎన్నికలు జరగనున్న జీహెచ్ఎంసీ కొత్త పాలక మండలిలో మేయర్‌గా మరోసారి మహిళే ఎన్నిక కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల ఛైర్మన్లు, మేయర్లకు శనివారం లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. పది మున్సిపల్ కార్పొరేషన్లకు గానూ జీహెచ్ఎంసీకి మహిళ (జనరల్) రిజర్వు కావడంతో రాబోయే పాలకమండలిలోనూ హైదరాబాద్‌లో మహిళే చక్రం తిప్పనున్నారు.
News January 18, 2026
ఖమ్మం:పురపాలక పీఠాలపై ‘మహారాణుల’ రాజ్యమే..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మొత్తం 9 స్థానాల్లో (రెండు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలు) ఆరింటిని మహిళలకే కేటాయించారు. ఖమ్మం మేయర్, వైరా, సత్తుపల్లి, మధిర, అశ్వారావుపేటలను జనరల్ మహిళకు కేటాయించగా.. ఇల్లెందు బీసీ మహిళకు, ఏదులాపురం ఎస్సీ మహిళకు దక్కాయి. కల్లూరు, కొత్తగూడెంలు ఎస్టీ జనరల్ విభాగంలో ఉన్నాయి. పురపాలక పీఠాలపై మహిళల ఆధిపత్యం ఖాయమైంది.
News January 18, 2026
కడప: ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీనా.. ఫోన్ చేయండి.!

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు ఛార్జీలను విపరీతంగా పెంచాయి. దీంతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. దీనిపై రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. నిబంధనలకు లోబడి మాత్రమే ఛార్జీలను వసూలు చేయాలని ట్రావెల్స్ యజమానులకు సూచించారు. ఎవరైన అధిక ఛార్జీలు వసూలు చేస్తే 9281607001 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.


