News September 10, 2025

దసరా సెలవుల్లో మార్పులు చేయాలని విజ్ఞప్తి

image

AP: దసరా సెలవుల్లో మార్పులు చేయాలని ప్రభుత్వానికి MLC గోపిమూర్తి విజ్ఞప్తి చేశారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం స్కూళ్లకు ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉన్నాయి. అయితే పండుగ ఈ నెల 22 నుంచే మొదలవుతుందని, ఈ నేపథ్యంలో ఆ తేదీ నుంచే సెలవులు ఇవ్వాలని కోరారు. DSC నియామకాలకు ముందే అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలని, పెండింగ్‌లో ఉన్న స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లను పూర్తి చేయాలన్నారు.

Similar News

News December 13, 2025

గురుకుల స్కూళ్లలో అడ్మిషన్లు.. అప్లై చేసుకోండిలా

image

TG: ప్రభుత్వ రెసిడెన్షియల్ (గురుకుల) స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5-9 తరగతుల్లో అడ్మిషన్లకు ప్రభుత్వం TGCET నిర్వహించనుంది. ఈ పరీక్షకు అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే ఏడాది జనవరి 21 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 22న ఎగ్జామ్ ఉంటుంది. పరీక్ష ఫలితాల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం <>https://tgcet.cgg.gov.in/<<>> వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.

News December 13, 2025

IIBFలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్& ఫైనాన్స్‌(IIBF)లో 17 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ (కామర్స్/ఎకనామిక్స్/బిజినెస్ మేనేజ్‌మెంట్/IT/CS/కంప్యూటర్ అప్లికేషన్), డిప్లొమా(IIBF), M.Com/MA/MBA/CA/CMA/CFA, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.iibf.org.in

News December 13, 2025

(PMAY-G)-NTR స్కీమ్.. రేపటి వరకే ఛాన్స్

image

AP: PM ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G)-NTR పథకం దరఖాస్తు గడువు రేపటితో(డిసెంబర్ 14) ముగియనుంది. దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ పథకం కింద సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు గృహ నిర్మాణం కోసం ₹2.50లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. సొంత స్థలం లేని వారికి 3 సెంట్ల స్థలం, ఆర్థికసాయం అందజేస్తారు.