News May 3, 2024

APPLY: రైల్వేలో 4,660 ఉద్యోగాలు

image

RPFలో 4,660 పోలీస్ ఉద్యోగాల(SI-452, కానిస్టేబుల్-4,208)కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మే 14 వరకు అప్లై చేసుకోవచ్చు. SI అభ్యర్థులకు డిగ్రీ, 20-28 ఏళ్ల వయసు, కానిస్టేబుల్ అభ్యర్థులు 18-28 ఏళ్ల వయసు, టెన్త్ పాసై ఉండాలి. ఆన్‌లైన్‌ టెస్టు, ఫిజికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. SIలకు ₹35,400, కానిస్టేబుళ్లకు ₹21,700 ప్రారంభ వేతనం ఉంటుంది. వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in/

Similar News

News November 6, 2024

అకౌంట్లలోకి డబ్బులు.. కీలక ప్రకటన

image

AP: ఈ విద్యాసంవత్సరం(2024-25) నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు నేరుగా కాలేజీల ఖాతాల్లో జమచేసేలా పాత పద్ధతిని అవలంబిస్తామని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. బకాయిలు రూ.3,500 కోట్లు విడతల వారీగా చెల్లిస్తామని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కాలేజీలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. కాగా, గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు తల్లుల ఖాతాల్లో డిపాజిట్ అయ్యేవి.

News November 6, 2024

మళ్లీ కెప్టెన్ అయిన డేవిడ్ వార్నర్

image

ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ మళ్లీ కెప్టెన్సీని చేపట్టారు. బాల్ టాంపరింగ్ కారణంగా ఆయన కెప్టెన్సీ చేయకుండా క్రికెట్ ఆస్ట్రేలియా ఆరేళ్ల క్రితం నిషేధం విధించింది. తాజాగా ఆ నిషేధాన్ని ఎత్తివేయడంతో బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ ఆయన్ను తమ కెప్టెన్‌గా నియమించింది. అదే జట్టుకు 2011లో వార్నర్ కెప్టెన్‌గా ఉన్నారు. IPLలోనూ SRHకి కెప్టెన్‌గా కప్ అందించారు.

News November 6, 2024

నాకు కాదు DCMకు చెప్పు: అంబటి

image

AP: హోం మంత్రి అనిత ఎవరో చెప్పాల్సింది తనకు కాదని, DCMకు చెప్పాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అనిత ఇచ్చుకున్న సెల్ఫ్ సర్టిఫికెట్‌కు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, చాలా సంతోషంగా ఉందని ఎద్దేవా చేశారు. ‘H.Mగా బాధ్యత వహించండి. నేను బాధ్యత తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి’ అన్న వ్యక్తికి <<14546885>>ఈ విషయాన్ని<<>> చెప్పాలని సూచించారు.